మెగా ఫ్యాన్స్ కి తీపి కబురు..కార్డ్ షేర్ చేసి మరి గుడ్ న్యూస్ చెప్పిన నీహారిక..!

నిహారిక .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ చెందిన పేరు. హోస్టుగా తన కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. జొన్నలగడ్డ చైతన్య పెళ్లి చేసుకున్న నిహారిక కొద్ది కాలానికి విడాకులు ఇచ్చేయడం గమనార్హం. విడాకుల తర్వాత నిహారిక జెట్ స్పీడ్ లో కెరియర్లో ముందుకెళ్తుంది.

రీసెంట్గా నిహారిక తన అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పింది . ఒక పక్క సినిమాలో నటిస్తూనే మరొక పక్క సినిమాలను నిర్మిస్తూ వస్తుంది నిహారిక. తాజాగా నిహారిక ఒక కార్డు షేర్ చేస్తూ అభిమానులకు గుడ్ న్యూస్ అందించింది . తన ప్రొడక్షన్ హౌస్ లో స్టార్ట్ అయ్యే ఫస్ట్ సినిమాకి సంబంధించిన మూవీ టైటిల్ ని ఫిక్స్ చేయడానికి అనౌన్స్ చేయడానికి సాయి ధరంతేజ్ గెస్ట్ గా వస్తున్నాడు అంటూ ప్రకటించింది.

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎస్ ఆర్ టీం స్టూడియో సంయుక్తంగా ప్రొడక్షన్ వన్ స్టార్ట్ కాబోతుంది . దీనికి సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ గారిచే.. సినిమా నామకరణ మహోత్సవం అంటూ చాలా వెరైటీగా కార్డును డిజైన్ చేసింది. వేదిక యూట్యూబ్ ఇంస్టాగ్రామ్ అని ఉండగా భోజనాలు ఎవరింట్లో వాళ్ళు అంటూ ఫన్నీగా రాసుకోచ్చింది. మధ్యాహ్నం 12 గంటలకు ఈవెంట్ జరగబోతుంది అంటూ చెప్పింది . దీంతో నిహారిక – సాయి ధరమ్ తేజ్ ఫోటోలను ఇలా పక్కపక్కనే చూసిన జనాలు ఫన్నీగా కౌంటర్స్ వేస్తున్నారు . ప్రెసెంట్ ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది..!!