సరికొత్త జోనర్ తో ప్రేక్షకుల ముందుకి వస్తున్న అఖిల్ అక్కినేని.. ఈసారైనా హిట్ కొడతావా? అంటూ కామెంట్స్..!

యంగ్ హీరో అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కినేని నాగార్జున వ‌రసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ పెద్దగా గుర్తింపు పొందలేకపోయాడు. ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఒక్కో డిజాస్టర్ గా నిలవడంతో ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి కొంత గ్యాప్ ఇచ్చాడు. అఖిల్ నటన బాగున్నప్పటికీ సరైన కథలను ఎంచుకోకపోవడమే ఇందుకు కారణమయ్యింది.

ఇక ఇటీవలే సలార్ సక్సెస్ మీట్ లో కనిపించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు అఖిల్. అయితే ఆ లుక్ తన నెక్స్ట్ మూవీ కోసం అని అప్పుడు అనేక ప్రచారాలు జరిగాయి. ఇక లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అఖిల్ 6 మూవీ అనౌన్స్ మెంట్ ఉగాదికి రానున్నట్లు తెలుస్తుంది.

సోహిల్ కు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన అఖిల్ కుమార్ ఈ మూవీ తో డైరెక్టర్ గా పరిచయం కానున్నాడు. ఇక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే.. ఈ మూవీ పిరియాడికల్ జోనర్ లో సాగే యాక్షన్ అండ్ టైనర్ మూవీ. ఇక ఇది అఖిల్ తన కెరీర్ లో చేస్తున్న తొలి పిరియాడిక్ మూవీ కావడం విశేషం. ఇక ఈ మూవీ తో అయినా అఖిల్ తన పేరును టాలీవుడ్ లో వైరల్ చేస్తాడో లేదో చూడాలి.