ఇప్పటి వరకు ఏ సినిమాకి చేయని పని “తండేల్” కోసం చేయబోతున్న చైతూ..ఇక థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే..!..!

అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడిగా .. అక్కినేని నాగార్జున కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య .. ప్రజెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్న మూవీ తండేల్. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతుంది . ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ నాచురల్ బ్యూటీ హీరోయిన్ సాయి పల్లవి నటిస్తుంది . లవ్ స్టోరీ సినిమా తర్వాత మళ్లీ ఇలాంటి ఓ క్రేజీ కాంబో సెట్ అవ్వడంతో ఫ్యాన్స్ ఈ కాంబో పై ఓ రేంజ్ లో ఊహించుకుంటున్నారు .

తండేల్ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ కూడా అభిమానులకి గూస్ బంప్స్ తెప్పిస్తుంది . కచ్చితంగా సినిమాలో కంటెంట్ ఉంది అని నాగచైతన్యకు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అందజేస్తుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సినిమా నుంచి రిలీజ్ అయిన ఒక అద్భుతమైన మ్యాటర్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఈ సినిమా మత్స్యకారుల జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న విషయం ఇప్పటికే డైరెక్టర్ ప్రకటించారు.

ఈ సినిమాలో వచ్చే ఇంటర్వెల్ బ్యాక్ డ్రాప్ లో అద్భుతమైన సస్పెన్స్ ఉంది అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది. ముఖ్యంగా వర్షంలో వచ్చే ఫైట్ సీన్ ఈ సినిమాకి హైలైట్ కాబోతుందట . ఫస్ట్ టైం కెరియర్ లో డూప్ లేకుండా ఈ సినిమాలో నటించాడు చైతన్య అంటూ కూడా తెలుస్తుంది. ఈ ఫైట్ సీన్ వచ్చినప్పుడు అరుపులు విజిల్స్ తో పాటు థియేటర్లు దద్దరిల్లడం ఖాయం అన్న టాక్ గట్టిగా వినిపిస్తుంది. దీంతో సోషల్ మీడియాలో తండేల్ సినిమాకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి . ఈ సినిమాపై హ్యూజ్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు. అందుతున్న సమాచారం ప్రకారం దసరా కానుకగా తండేల్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది..!!