కోట్లు ఆఫర్ చేసిన ఇప్పటి వరకు అలాంటి పనులు చేయని సౌత్ హీరోలు వీళ్లే.. రియల్లీ గ్రేట్ ..!

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలకు హిట్ కొట్టాలన్న ధ్యాస తప్పిస్తే వేరే ఒక ధ్యాస ఉండనే ఉండదు. అది రీమేక్ సినిమానా..? లేకపోతే డబ్బింగ్ సినిమానా..? వేరే హీరో చేసిన సీక్వెల్ సినిమానా..? అన్న విషయాలు పట్టించుకోకుండా హిట్ అవుతుంది ఆ సినిమా అంటే చాలు .. అది ఎటువంటి డైరెక్టర్ అయినా.. కమిట్ అయిపోతూ ఉంటారు . కానీ కొంతమంది హీరోలు మాత్రం చాలా చాలా డిఫరెంట్ సినిమా ఫ్లాప్ అయినా పర్వాలేదు లాభాలు రాకపోయినా నష్టం లేదు జనాలను ఎంటర్టైన్ చేశామా..? జనాలకు ఏదైనా మెసేజ్ ఇచ్చామా..? అన్న రేంజ్ లో ఉంటారు . అలాంటి వాళ్లలో మన తెలుగు హీరోలు కూడా ఉన్నారు. అంతేకాదు ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క రీమేక్ సినిమా కూడా చేయని సౌత్ ఇండియా స్టార్స్ గురించి ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకోబోతున్నము..!!

మహేష్ బాబు : కెరియర్ లో 28 సినిమాలు చేశాడు ..29వ సినిమాల సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు . అయితే ఇప్పటివరకు మహేష్ బాబు తన కెరియర్ లో ఒక్కటంటే ఒక్క రీమేక్ మూవీ కూడా చేయలేదు .. చేసే ఛాన్స్ వచ్చిన కోట్లు ఆఫర్ చేసిన తిరస్కరించాడు మహేష్ బాబు .

విజయ్ దేవరకొండ : టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ తర్వాత ఆయనకు ఎన్నెన్నో ఆఫర్లు వచ్చినా సరే ఒక్కటంటే ఒక్క రీమేక్ సినిమా వైపు కూడా చూడలేదు.

దుల్కర్ సల్మాన్ : మల్టీ టాలెంటెడ్ హీరో .. మహానటి సినిమా ద్వారా ఆయన ఎంత పాపులారిటీ సంపాదించుకున్నాడో తెలిసిందే . ఇక సీతారామం సినిమాతో అందరికీ ఫేవరెట్ హీరోగా మారిపోయాడు . ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క రీమేక్ సినిమాలో కూడా నటించలేదు.

రక్షిత్ శెట్టి : పేరుకి కన్నడ హీరోనే అయినా తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. సప్త సాగర దాచేయల్లో సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు . ఇప్పటివరకు ఈ హీరో కూడా ఒక్కటంటే ఒక్క రీమేక్ సినిమా కూడా చేయకపోవడం గమనార్హం..!!