బిగ్ బాస్ సీజన్ 8 వచ్చేస్తుందోచ్.. ఈసారి హోస్ట్ ఎవరంటే.. ?

బిగ్ బాస్ ..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తెలుగులో ఆల్రెడీ ఏడు సీజన్స్ కంప్లీట్ చేసేసుకుంది. బిగ్ బాస్ కి వెళ్ళిన వాళ్ళు వెళ్లిన తర్వాత చెప్పే మాటలు..వెళ్లక ముందు చెప్పే మాటలు.. రెండు డిఫరెంట్ గా ఉంటాయి. ఆ సిచువేషన్ ఫేస్ చేసిన వాళ్ళకి ఆ ప్రాబ్లం తెలుస్తుంది . రీసెంట్గా బిగ్ బాస్ కి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. సక్సెస్ఫుల్గా ఏడు సీజన్లు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ త్వరలోనే ఎనిమిదవ సీజన్ రాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది .

బిగ్ బాస్ మేనేజ్మెంట్ సీజన్ 8 కోసం కంటెస్టెంట్లను అలాగే హోస్ట్ లను వెతికే పనిలో పడ్డారట. అయితే ఎప్పటిలా కాకుండా ఈసారి హోస్టుగా నందమూరి బాలకృష్ణ ను చూస్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు మునుపటిలా ఎక్కువ మంది కంటెస్టెంట్స్ కాకుండా ఈసారి లిమిటెడ్ కంటెస్టెంట్స్ తోనే క్రేజీ క్రేజీ థీమ్స్ తో టాస్కులతో టీఆర్పీలు బ్లాస్ట్ అయ్యే రేంజ్ లో చేయబోతున్నారట .

బిగ్బాస్ సీజన్ 8 కు సంబంధించి కంటెస్టెంట్స్ సెలక్షన్ డిజైన్ ఫ్యాన్ పేజెస్ తో పాటు ఇతర పనులు కూడా చక్కగా ముందుకు తీసుకెళుతున్నట్లు తెలుస్తుంది. ఈసారి పలువురు యూట్యూబర్లు కూడా హౌస్ లోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారట బిగ్బాస్ మేనేజ్మెంట్. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం జూన్లో ఈ షో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుం. ది ఎలక్షన్స్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత బాలకృష్ణ ఈ షో ని హౌస్ట్ చేయబోతున్నట్లు క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది..!!