వార్ 2 కోసం NTR అలాంటి రిస్క్ చేయబోతున్నాడా..? వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోస్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా కానీ నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్తే వచ్చే కిక్.. ఆ అరుపులు ..ఆ ఎంజాయ్మెంట్ ..వేరే లెవెల్ లో ఉంటాయి . ఒకసారి ట్రై చేయండి ఏదైనా ఈవెంట్ కి వెళ్ళినా .. ఫంక్షన్ కి వెళ్లిన .. అక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ పేరుని ఎలా అరుస్తూ ఉంటారో.. ఒక్కసారి వినండి.. మీకే అర్థమయిపోతుంది . అలా ఎన్టీఆర్ పేరు అరిచినప్పుడు వచ్చే ఫీలింగ్ మరో రేంజ్ లో ఉంటాయి. ప్రెసెంట్ ఎన్టీఆర్ తనదైన స్టైల్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు .

ఆయన లాస్ట్ గా నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. కోట్లాదిమంది ఇండియన్స్ ఎదురుచూసిన ఆస్కార్ అవార్డును ఇండియాకు తీసుకువచ్చింది . ప్రెసెంట్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న దేవర సినిమాలో హీరోగా నటిస్తున్నాడు . ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కబోతుంది . ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వార్ 2 సినిమాలో కూడా నటిస్తున్నాడు .

పోయిన వారం ఈ సినిమా షూట్లో పాల్గొన్నాడు . ఆయనకు సంబంధించిన పిక్స్ కూడా వైరల్ అయ్యాయి. రీసెంట్గా మళ్లీ ముంబైకి బయలుదేరాడు ఎన్టీఆర్ . ఆదివారం ఆయన ముంబైకి వెళ్లడానికి ఎయిర్ పోర్ట్ కి వచ్చారు. అప్పుడు ఆయన లుక్స్ బాగా వైరల్ గా మారాయి . వైట్ షర్ట్ లో.. క్లీన్ షేవ్ చేసి యంగ్ టైగర్ ల గంభీరంగా నడుస్తున్న పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి .

కాగా మరో వారం రోజులపాటు ఎన్టీఆర్ ముంబైలోనే స్టే చేయబోతున్నాడట . అక్కడే ఆయన ఉండి వార్ 2 సినిమా షూట్స్ లో పాల్గొనబోతున్నాడట . ఈ సినిమాలో ఫస్ట్ టైం పూర్తిస్థాయిలో నెగిటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు. ఒక పాన్ ఇండియా హీరో ఇలా నెగటివ్ షేడ్ లో కనిపించడం బిగ్ రిస్క్ అనే చెప్పాలి . కానీ తారక్ ఆ ధైర్యం చేస్తున్నాడు . చూద్దాం ఈ నిర్ణయం ఆయనకు ఏ విధంగా కలిసి వస్తుందో..???