“ఎవ్వరితో చేస్తారో చేసుకోండి”.. స్టేజీ పైనే నాని అంత మాట అనేశాడు ఏంటి..?

నాని .. ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేయించుకున్నాడు నాని . నాని నటించిన సినిమాలు అన్ని చక్కగా ఉంటాయి. బిగ్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయినాయి ..అలాగే దారుణాతి దారుణంగా ఫ్లాప్ కూడా అయ్యాయి . అయితే సినిమా హిట్ అయిన ఫ్లాప్ పైన నాని నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి . కాగా నాని కెరియర్ లో వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్గా నిలిచిన సినిమా జెర్సీ .

ఈ సినిమా అప్పట్లో అభిమానులను ఎలా ఆకట్టుకునిందో మనకు తెలిసిందే . క్రికెట్ బ్యాక్ డ్రాప్ తో తీసిన ఈ చిత్రం ఎలాంటి కమర్షియల్ హిట్ అందుకునిందో కూడా మనకి తెలుసు. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్లోని సుదర్శన్ థియేటర్లో రిలీజ్ చేశారు మేకర్స్. ప్రేక్షకుల నుంచి మళ్లీ విశేషణ స్పందన రావడం గమనార్హం. ఇదే క్రమంలో జెర్సీ మూవీకి సీక్వెల్ రావాలి అంటూ ఎప్పటినుంచో ఫ్యాన్స్ కోరుకుంటున్నారు .

తాజాగా ఆ ఒక్కటి అడక్కు మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న నాని కి ఇదే ప్రశ్న ఎదురైంది . అయితే నాని ఏదో ఆన్సర్ చెప్తాడు అనుకున్నా అభిమానులకు నిరాశ మిగిలింది. ” నేను లేనుగా ఎవరితో చేస్తారో చేసుకోండి ” అంటూ చాలా కన్ఫ్యూషన్ గా ఆన్సర్ ఇచ్చాడు . నాని చెప్పిన ఆన్సర్ బట్టి చూస్తుంటే జెర్సీ సినిమాకి సీక్వెల్ రానట్టే .. ఇకపై రావడం కష్టం అన్నమాట అన్న విషయం క్లియర్ గా అర్ధమైపోతుంది. అయితే నాని ఎందుకు ఇలా కామెంట్ చేశాడు అనేది మాత్రం ఇంకా అర్థం కావడం లేదు..??