“నాకు ఎందుకు సిగ్గు”.. కాలుపై ఉన్న టాటూ కి అర్ధం ఏంటో పచ్చిగా చెప్పేసిన ఫరియా అబ్దుల్లా..!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏ వార్త అయినా సరే ఇట్టే వైరల్ గా మారిపోతుంది. మరీ ముఖ్యంగా సినిమా ప్రమోషన్స్ కోసం హీరోయిన్స్ చేసే పనులు చాలా చాలా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. కొన్నిసార్లు అవసరమున్న అవసరం లేకపోయినా ఒకే విషయాన్ని రాద్ధంతంగా చేస్తూ ఉండడం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చెప్పుకొస్తున్నారు జనాలు . రీసెంట్గా ఫరియా అబ్దుల్లా సైతం అదే లిస్టులోకి యాడ్ అయిపోయినట్లు తెలుస్తుంది . ఫరియా అబ్దుల్లా.. ఈ పేరు కన్నా చిట్టి అన్న పేరు చెప్తే జనాలు బాగా గుర్తుపట్టేస్తారు .

హైదరాబాది బ్యూటీ.. జాతి రత్నాలు అనే సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది . ఆడియన్స్ కు బాగా దగ్గరయింది. ఆ తరువాత మెయిన్ లీడ్ రూల్స్ తో పాటు సపోర్టింగ్ రూల్స్ కూడా చేస్తూ తన పేరు జనాలు మర్చిపోకుండా ఉండేలా ట్రెండ్ చేస్తుంది. రీసెంట్గా ఈ బ్యూటీ నటించిన సినిమా ఆ ఒక్కటి అడక్కు. హీరో అల్లరి నరేష్తో స్క్రీన్ షేర్ చేసుకుంది . ఈ మూవీ ట్రైలర్ ని హీరో నాని చేతుల మీదుగా గ్రాండ్ గా రిలీజ్ చేశారు మేకర్స్ .

అనంతరం ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు . ఈ ఈవెంట్లో ఫరియా అబ్దుల్లా కాలిపై ఉన్న టాటూ హైలెట్గా మారింది . ఒక రిపోర్టర్ దానికి అర్థం ఏంటి..? అంటూ సూటిగా ప్రశ్నించేశాడు. ఈ టాటూ ..”రూట్స్.. నేను పర్సనల్గా నమ్మేది ఏంటంటే ఏరులు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మనం అంత ఎత్తుకు ఎదుగుతాం ..ఎదగ గలం కూడా.. ఆ ఉద్దేశంతోనే ఈ టాటూను వేయించుకున్నాను .. సెలబ్రిటీలకు ముఖ్యంగా ఓపిక పేషెన్సీ అనేది ఇంపార్టెంట్ .. అది నేను మర్చిపోకుండా ఉండడానికి ఇది నాకు గుర్తు చేస్తూ ఉంటుంది ” అంటూ తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చింది ఫరియా. ఫరీయా అబ్దుల్లా చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . కొంతమంది ఎటువంటి సీన్ క్రియేట్ చేయకుండా ఉన్నది ఉన్నట్లు ఆన్సర్ చేసి అందరి చేత శభాష్ అనిపించుకుంది చిట్టి అంటూ పొగిడేస్తున్నారు..!!