భార్యతో కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో అల్లు అర్జున్.. షాక్ లో ఫ్యాన్స్.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ డైరెక్షన్‌లో పుష్పా సినిమాతో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న ఈయన నేషనల్ అవార్డును దక్కించుకొని టాలీవుడ్‌లో నయా రికార్డ్‌ సృష్టించాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాకు సీక్వెల్ గా తెర‌కెక్కుతున్న పుష్ప 2లో నటిస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అసలు సిసలు బన్నీ మాస్ విశ్వరూపం సినిమాలో ఉంటుందని నెటింట చర్చలు మొదలయ్యాయి. ఇక ప్రస్తుతం ఇండియా మొత్తంలో సార్వత్రిక ఎన్నికల హడావిడి నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్, భార్య స్నేహారెడ్డి తో కలిసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలక్షన్ క్యాంపైనింగ్ లో పాల్గొన్నట్లు ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

దీంతో అభిమానులంతా బన్నీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడమేంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇంత‌కి అసలు మ్యాటర్ ఏంటంటే అల్లు అర్జున్, స్నేహ రెడ్డి కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓపెన్ టాప్ కారులో నిలుచుని ఎన్నికల ప్రచారం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. చూడగానే నిజంగా బన్నీ, స్నేహ రెడ్డి క్యాంపైనింగ్ చేస్తున్న‌ట్లే కనిపిస్తున్నారు. అయితే అసలు వాస్తవం వేరు. గత ఏడాది అల్లు అర్జున్ తన భార్యతో కలిసి న్యూయార్క్ లో ఇండియా 75 స్వతంత్ర వేడుకల్లో పాల్గొని సందడి చేశాడు. ఈ వేడుకల్లో బన్నీ తన భార్యతో కలిసి పాల్గొన్న ఓ వీడియో సహాయంతో ఒక డీప్ ఫేక్ వీడియోను క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్ గా మారింది.

అయితే గతంలో అమీర్ ఖాన్, రణ్‌వీర్ సింగ్ లాంటి స్టార్ హీరోలపై కూడా ఇలానే డీపె ఫేక్ వీడియోలను క్రియేట్ చేయగా వీరు కేసు నమోదు చేశారు. మరి బన్నీ డీప్ ఫేక్ వీడియో పై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ మామగారు చంద్రశేఖర్ రెడ్డి రాజకీయాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. మేనమామ పవన్ కళ్యాణ్ కూడా బలంగా జనసేన పార్టీని ముందుకు తీసుకు వెళుతున్నారు. అయితే బన్నీ మాత్రం ఎప్పుడు రాజకీయాలకు దూరంగానే ఉంటున్నాడు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం ఆయన ప్రచారానికి వెళ్తారు అంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. గతంలో పవన్ భీమవరం లో పోటీ చేసిన సమయంలో బన్నీ ఒక కుటుంబ సభ్యుడిగా ఆయనకు మద్దతుగా నిలిచారు. ఈసారి బన్నీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో వేచి చూడాలి.