పుష్ప 2 ఫస్ట్ సింగిల్ ప్రొమో చూశారా.. నా సామీ రంగా మెంటల్ ఎక్కించేశాడు ఈ దేవిగాడు(వీడియో)..!

కోట్లాదిమంది సినీ లవర్స్ ఎప్పుడెప్పుడు అంటూ ఎదురుచూసిన పుష్ప సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది . పుష్ప రాజ్ గాడి ఫ్యాన్స్ ఈ అప్డేట్ ను ఓ రేంజ్ లో ట్రెండ్ చేసేస్తున్నారు . టాలీవుడ్ ఇండస్ట్రీలో లెక్కల మాస్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా నటిస్తున్న సినిమా పుష్ప2. ఆల్రెడీ వీళ్ళ కాంబోలో వచ్చిన పుష్ప వన్ సినిమాకి ఈ మూవీ సీక్వెల్ గా రాబోతుంది .

ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్నా నటిస్తుంది. పుష్ప2 సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఊగిపోతూ ఉంటారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ అయింది . కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు మేకర్స్. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీత దర్శకుడు గా వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే.

మొదటి భాగం సాంగ్స్ ఎంత హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా హిట్ కి ఎంతో కారణమయ్యాయి . సెకండ్ పార్ట్ లో కూడా అదే మ్యూజిక్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు . అయితే దానికి మించిన రేంజ్ లో దేవి సినిమా కోసం కష్టపడ్డాడు అని చిన్న బిట్ తోనే తెలిసిపోతుంది. మరి ముఖ్యంగా పుష్ప .. పుష్ప .. పుష్ప అంటూ సాగే లిరిక్స్ ఈ పాటకి హైలైట్ కాబోతున్నాయి . ఈ పాటకి చంద్రబోస్ లిరిక్స్ అందించినట్లు తెలుస్తుంది. ఇక ఈ పాట ఫుల్ లిరికల్ సాంగ్ మే 1న ఉదయం 11 గంటల ఏడు నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు . పుష్పరాజ్ గాడి రూలింగ్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఈ పాట ప్రోమోతో సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్నాడు . మరెందుకు ఆలస్యం ఆ ప్రోమో ని మీరు చూసి ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసేయండి..!