బిగ్ సర్ప్రైజ్: చెప్పకుండానే ఎంగేజ్మెంట్ చేసుకున్న స్టార్ సింగర్.. అబ్బాయి ఎవరో తెలుసా..?

ఈ మధ్యకాలంలో ఇలాంటివి మనం చాలా చాలా ఎక్కువగా చూస్తున్నాం . సీక్రెట్ గా పెళ్లి చేసుకునేస్తున్నారు.. సీక్రెట్ గా నిశ్చితార్థం కూడా చేసేసుకుంటున్నారు . అయితే చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ఇదే రూట్ ఫాలో అవుతూ ఉండడం గమనార్హం. తాజాగా ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న మరో సింగర్ కూడా ఇలాగే అభిమానులకి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చింది . శ్రీ లలిత ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . చాలామంది ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకునింది .

లిటిల్ ఛాంప్స్.. పాడుతా తీయగా.. బోల్ బేబీ బోల్.. స్వరాభిషేకం లాంటి రియాల్టీ షోస్ లో పాల్గొని తన టాలెంట్ ఏంటో జనాలకు తెలియజేసేలా చేసుకునింది. మరీ ముఖ్యంగా శ్రీ లలిత కాంతారా సినిమా లో వరాహ రూపం పాట పాడి హ్యూజ్ పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకునింది . దాదాపు ఏడాది క్రితం యూట్యూబ్లో ఆ వీడియో పోస్ట్ చేయగా సుమారు 8.5 మిలియన్ల వ్యూస్ తగ్గించుకున్నాయి అంటే ఆమెలో ఎంత టాలెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు .

ఈ ట్రెడిషనల్ బ్యూటీ రీసెంట్గా నిశ్చితార్థం చేసుకున్నింది. ఆ ఫొటోస్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది . తనకు కాబోయే వ్యక్తిని చాలా డిఫరెంట్ గా పరిచయం చేసింది శ్రీ లలిత. జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు అంటూ పాట లిరిక్స్ టైప్ చేసి అదే విధంగా ఆయన తన లైఫ్ లోకి రావడం ఆమె ఎంత అదృష్టంగా ఫీల్ అవుతుందో చెప్పింది . ప్రస్తుతం దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు ఈడు జోడు బాగుంది అని .. మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అని ఫ్యాన్స్ విష్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో శ్రీ లలిత ఎంగేజ్మెంట్ ఫొటోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి..!!