మంగ్లీ అభిమానులకు గుడ్ న్యూస్.. అరుదైన గౌరవాన్ని అందుకున్న స్టార్ సింగర్..

సింగర్ మంగ్లీ.. తెలుగు ప్రేక్షకుల్లో ఈ పేరు తెలియని వారు ఉండ‌రన‌టంలో అతిశ‌యోక్తిలేదు. మ్యూజిక్ అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఈమె అంటే కూడా అంతే అభిమానం ఉంటుంది. అంతలా జనాల్లో కనెక్ట్ అయినా ఈ బ్యూటీ.. జానపద పాటలతో మొదట గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పలు సినిమాల్లో కూడా పాటలు అందిస్తూ స్టార్ సింగర్ గా పాపులారిటీ దక్కించుకుంది. ఇటు జానపద పాటలతోనూ, మరో పక్కన డివోషనల్ సాంగ్స్.. సినిమా పాటలతో కూడా తన సత్తా చాటుతూ దూసుకుపోతుంది.

ఇటీవల స్వాధా ఫౌండేషన్ నిర్వహించడం మార్గ 2024 ఈవెంట్‌లో ఉషా ఉతాఫ్, సుధా రఘునాథన్ లాంటి స్టార్ సింగ‌ర్‌ల‌తో కలిసి మంగ్లీ స్టేజ్‌ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంగీత ప్రపంచంలో ఆమె అందుకున్న విజయాలకు గాను ఆమె ప్రతిభకు.. అకాడమీ గౌరవిస్తూ ఉస్తాది బిస్మిల్లా ఖాన్.. యువ పురస్కారానికి ఎంపిక చేసింది.

ప్రస్తుతం ఈ విషయం నెటింట వైరల్ గా మారడంతో.. ఆమె అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంకా మునుముందు మంగ్లీ ఇలాంటి ఎన్నో అవార్డులను అందుకోవాలని.. త‌న‌కు ఫూచ‌ర్‌లో త‌న స‌త్త ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాటుకున్నేలా అవ‌కాశాలు రావాల‌ని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మ‌రికొంద‌రు ఆమెకు ఈ ఆవార్డ్ అందినందుకు కృత‌ఞ‌త‌లు తెల్పుతున్నారు.