చిరు సినిమాలో నటించే ఛాన్స్.. రిజెక్ట్ చేసిన సిద్దు జొన్నలగడ్డ.. కారణం ఇదే..?!

ప్ర‌స్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం టిల్లు ఫీవర్ మొదలైంది. టిల్లు స్క్వేర్ సినిమా కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా రెండు రోజుల్లోనే రూ.25 కోట్ల భారీ వసూళ్లను కొల్లగొట్టింది. దీన్నిబట్టి టిల్లు పాత్రలో సిద్దు చేసిన సందడి ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక అనుపమ, సిద్దు జొన్నలగడ్డ మధ్య కెమిస్ట్రీ యూత్ కు బాగా కనెక్ట్ అయిందని తెలుస్తుంది. అనుపమ, సిద్దు మధ్య నడిపించిన కెమిస్ట్రీ.. ఆ విధానం చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఈ క్రమంలో సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ మూవీ ప్రమోషన్స్ లో మరింత బిజీ అయ్యాడు. ఇటీవ‌ల ఓ ఇంటర్వ్యూలో అయన మాట్లాడుతూ చిరంజీవిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

గతంలో సిద్దుకి.. చిరంజీవితో నటించే అవకాశం వచ్చిందని.. కానీ ఆ సినిమాను ఆయన రిజెక్ట్ చేశానంటూ వివరించాడు. తాజాగా ఈ ఇంటర్వ్యూలో సిద్దు దానిపై క్లారిటీ ఇచ్చాడు. నిజంగానే చిరు గారితో నేను సినిమా చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు.. చిరంజీవి గారితో సినిమా అంటే నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే గొప్ప ఫీలింగ్.. ఆయనతో నటించడం ఒక ఎక్స్ట్రాడినరీ మూమెంట్.. ఆయనతో సినిమా చేస్తే అలాంటి ఓ రేంజ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే.. ఆ సినిమాను అంగీకరించలేదంటూ వివరించాడు.

ప్రస్తుతం సరైన సందర్భం వచ్చినప్పుడు మా ఇద్దరి కాంబోలో సినిమా తెరకెక్కుతుందంటూ ఆయన వెల్ల‌డించాడు. చిరంజీవి గారిని కలిసినప్పుడు మేమిద్దరం నేను చనిపోయిన ఓ సినిమా గురించి మాట్లాడుకుంటాం.. ఆయన ఓ సూపర్ హ్యూమన్ అంటూ వివరించాడు. టాలీవుడ్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది చిరంజీవి గారు అంటూ ఆయన కామెంట్లు చేశాడు. చిరు, బాలయ్య అంటే నిజంగానే నాకు టాలీవుడ్ లో స్టార్స్ తో సమానం. అలాంటి స్టార్ట్స్ తో సినిమాలు అంటే కెరీర్ లోనే ది బెస్ట్ ప్రాజెక్ట్స్ అయి ఉండాలి.. అంటూ త్వరలో చిరంజీవి గారితో నటించే అవకాశం రావాలని కోరుకుంటున్నా అంటూ ఆయన మాట్లాడాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారా.యి