భార్యతో కలిసి స్టెప్పులు వేసిన రాజమౌళి.. ముసలోడే కానీ మహానుభావుడు..!

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈయనకి దక్కని అవార్డు అంటూ లేదు. దర్శక వీరుడుగా పేరు సంపాదించుకున్న రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవలే త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న రాజమౌళి నెక్స్ట్ మూవీ పై భారీ హైప్స్ ఉన్నాయి. ఇక ప్రస్తుతం రాజమౌళి మరియు మహేష్ సినిమా ఫ్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటుంది. రాజమౌళి కుటుంబ సభ్యులందరూ కలిసే ఉంటారు. ఇక రీసెంట్గా వీరి కుటుంబంలో ఓ చిన్న ఫంక్షన్ జరిగింది.

ఈ వేడుకలో రాజమౌళి తన భార్య రామ రాజమౌళితో కలిసి డాన్స్ వేశాడు. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రేమికుడు సినిమాలోని అందమైన ప్రేమ రాణి పాటకు జక్కన్న డాన్స్ వేశాడు. ఇక ఈయన డాన్స్ చూసి.. ముసలోడివే కానీ మహానుభావుడివి.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.