కోపం ఉన్న చరణ్ కోసం .. అలాంటి పని చేసిన ఏకైక తెలుగు హీరో ఇతడే..!

సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు . ఒక హీరో కోసం మరొక హీరో హెల్ప్ చేస్తూ ఉంటారు . ఇదంతా మనకు తెలిసిందే . అయితే పేరెంట్స్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తున్న కూడా ఒక హీరో మరొక హీరోకి సపోర్టివ్ గా మాట్లాడడం అప్పట్లో ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఆ హీరో మరెవరో కాదు మంచు విష్ణు . మంచు మోహన్ బాబు కి మెగాస్టార్ చిరంజీవికి మధ్య ఏవో కొన్ని ఫైట్స్ ఉన్నట్లు ఎప్పుడు ప్రచారం జరుగుతూనే ఉంటది .

అయితే రంగస్థలం సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచు విష్ణు రాంచరణ్ కు ఓ రేంజ్ లో సపోర్ట్ చేశాడు. రంగస్థలం సినిమాలో చరణ్ పర్ఫామెన్స్ ఎంత హైలెట్గా ఉంటుందో మనకు తెలిసిందే. కచ్చితంగా ఆయనకు అవార్డు వచ్చే పర్ఫామెన్స్ అది . కానీ అప్పట్లో ఆయనకు అవార్డు రాకుండా మరో హీరోకి అవార్డు ఇచ్చారు . ఆ టైంలో చాలామంది హీరోలు మాట్లాడారు తప్పిస్తే ఎక్కడ స్ట్రాంగ్ గా నిల్చోలేదు .

కానీ మంచు విష్ణు మాత్రం ఆ విషయంపై స్ట్రాంగ్ గా స్పందించారు. ఆ సమయంలో రాంచరణ్ నేషనల్ అవార్డుకు అర్హుడు అంటూ మంచు విష్ణు స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు . “అవార్డు గెలుచుకున్న వారి పట్ల నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు అని ..కానీ నిజాయితీగా చెప్తున్నా నా బ్రదర్ చరణ్ కి రంగస్థలం సినిమాకి నేషనల్ అవార్డు రావాల్సింది ..ఎందుకు రాలేదో అర్థం కావడం లేదు అదే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటూ స్ట్రాంగ్ గా ట్వీట్ చేశాడు”.. అప్పట్లో ఈ న్యూస్ వైరల్ గా మారింది. మెగా అభిమానులు కూడా మంచు విష్ణు చేసిన పనికి అప్రిషియేట్ చేశారు..!!