“యస్..ఫ్యామిలీ స్టార్ అట్టర్ ఫ్లాప్”.. దిల్ రాజు బోల్డ్ కామెంట్స్ కి ఫ్యాన్స్ ఫ్యూజులు అవుట్..!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సినిమాల రివ్యూస్ కి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నామో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా ఒక సినిమా హిట్టా ఫట్టా అన్నది రివ్యూవర్స్ చేతిలోనే ఉండిపోతుంది . ఆ సినిమా ఫ్లాప్ అని చెబితే జనాలు సినిమాను చూడడానికి కూడా థియేటర్స్ కి వెళ్లడం లేదు . ప్రెసెంట్ ఫామిలీ స్టార్ సినిమా విషయంలో అదే విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా తాజాగా నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్ . ఈ సినిమా నిన్న థియేటర్స్ లో రిలీజ్ అయి డిజాస్టర్ టాక్ అందుకుంది. అయితే సినిమాకి నెగిటివ్ టాక్ లేదు ..పాజిటివ్ టాక్ ఉంది కావాలనే కొందరు రివ్యూస్ నెగటివ్గా రివ్యూ ఇస్తున్నారు అంటూ నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఇచ్చి పడేశారు.

సినిమా సూపర్ సక్సెస్ అయింది అని ..చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ తమకు కాల్ చేసి సినిమా బాగుంది అని చెప్తున్నారు అని.. దిల్ రాజు చాలా చాలా బోల్డ్ గా స్పందించారు . అంతేకాదు కొందరు రాసే రివ్యూల కారణంగా సినిమా ఫ్లాప్ అని చెప్తే ఎలా అంటూ ఫైర్ అయ్యారు . రివ్యూవర్స్ ఒకలా మాట్లాడుతుంటే జనాలు మరొకలా మాట్లాడుతున్నారు అంటూ ఉన్న విషయాన్ని ఉన్నట్లు తేల్చి పడేసాడు . మీడియా వాళ్ళ ముందే మీడియాను ఓ రేంజ్ లో ఏకేశారు . అయితే విజయ్ దేవరకొండ అభిమానులు సైతం నిజమే ఫ్యామిలీ స్టార్ సినిమా బాగాలేదు ఆయన రేంజ్ కి సరితూగే సినిమా కాదు అంటూ చెప్పుకు రావడం గమనార్హం..!!