జీవితంలో పెళ్లి మరియు పిల్లలు వద్దు.. టాలీవుడ్ యంగ్ హీరో సంచలన నిర్ణయం..!

ఇటీవల కాలంలో చాలా మంది సీని సెలబ్రిటీలు పెళ్లి చేసుకుంటూ పర్సనల్ లైఫ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ యంగ్ హీరోలు ప్రేమించి పెళ్లి చేసుకుంటూ పిల్లలను కంటున్నారు. కొందరు పర్సనల్ లైఫ్ బిజీలో పడి సినిమాలకు కూడా దూరమవుతున్న పరిస్థితి ఉంది. అలాంటిది ఓ టాలీవుడ్ యంగ్ హీరో మాత్రం అసలు జీవితంలో పెళ్లి, పిల్లలు వద్దంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు.

అసలు విషయానికి వెళితే…టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ” ఉయ్యాల జంపాల” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో సపోర్టివ్ రోల్స్‌ లో చేసి మెప్పించాడు. అయితే రాజ్ తరుణ్ ఇటీవలే అక్కినేని హీరో నాగార్జున ‘నా స్వామి రంగా’ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నా రాజ్ తరుణ్ పెళ్లి, పిల్లల గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. యాంకర్ పెళ్లి గురించి ప్రశ్నించగా..

” ఏది ఏమైనాప్పటికీ జీవితంలో నేను పెళ్లి చేసుకోవద్దని డిసైడ్ అయ్యాను. నాకు పెళ్లి, పిల్లలను కనాలని లేదు. సింగిల్ లైఫ్ హ్యాపీ గా ఉంది. ఇక అందుకే పెళ్లి జోలికి వెళ్లడం లేదు. ఈ విషయంలో మా అమ్మ, నాన్న కూడా నా ఇష్టం అనేశారు. అయితే మా అమ్మ మాత్రం మొదట్లో పెళ్లి గురించి అడిగేది. కానీ ఇప్పుడు మాత్రం నా ఇష్టం అనేసింది” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రాజ్ తరుణ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.