ఓ మై గాడ్: నిద్రలోనే కళ్లు తెరిచి మాట్లాడే ఈ స్టార్ హీరోని గుర్తు పట్టారా..స్టార్ హీరోయిన్ భర్త కూడా..!

ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది.. మనలోని టాలెంట్ కి మనమే కొన్నిసార్లు గుర్తించాలి .. పక్క వాళ్ళు గుర్తించి చెప్తే కొన్ని కొన్ని సార్లు అది ఇబ్బంది కలగజేసే సిచువేషన్ లోకి నెట్టి వేస్తుంది . ప్రజెంట్ అలాంటి సిచువేషన్ ఫేస్ చేస్తున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ . ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . పలు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా లైఫ్ ని ముందుకు తీసుకెళ్తున్నాడు. కత్రినా కైఫ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విక్కి కౌశల్ లో ఉన్న స్పెషల్ టాలెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

విక్కీ కౌశల్ సన్నీ కౌశల్ బ్రదర్స్ . తాజాగా వీరు ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో కార్యక్రమానికి అతిథులుగా వచ్చారు. అందులో సరదా సరదాగా మాట్లాడారు . పలు ఇంపార్టెంట్ విషయాలను సైతం చర్చించుకున్నారు . ఈ క్రమంలోనే బ్రదర్ సన్నీ కౌశల్.. వికీ కౌశల్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ని రివీల్ చేశాడు . చిన్నప్పుడు విక్కీ రోజు మొత్తంలో ఏం జరిగింది..? ఏం చేశాడు..? అనే విషయాలు నిద్రలో మాట్లాడేవారు .

మొదట అదంతా మేము సరదాగా అనుకున్నాం .. ఆ తర్వాత అర్థమైంది అది ఆయనకు ఒక జబ్బు అని.. అసలు మెలకువతో ఉన్నాడా..? లేదా..? నిద్రపోతున్నాడా..? అర్థం అయ్యేది కాదు అలా ఓ రోజు నాకంటే 45 నిమిషాలు ముందే విక్కి నిద్రపోయాడు . కానీ నిద్రలో మాట్లాడుతున్నాడు.. అప్పుడే ఆయనకున్న విషయం బయటపడింది . అంతేకాదు నేను ఎగ్జామ్ రాసేసా ..నా ఆన్సర్ పేపర్ తీసుకొని చూసుకో అంటూ చెప్పుకొచ్చాడు . అంతేకాదు ఒకసారి వాళ్ళ అమ్మ వాళ్ళ పర్సనల్ విషయంలోను ఇలాగే ఇరుక్కునేసాడట . అతను నీ పర్స్ దొంగలించాడు అని నిద్రలో కలవరించేవాడట . వాళ్ళ అమ్మకు అది అర్థం కాక ఏంట్రా..? ఏం మాట్లాడుతున్నావ్..? అంటూ అరిచిందట.. ఈ విషయాని నవ్వుతూ చెప్పుకొచ్చాడు . ప్రజెంట్ విక్కీ కౌశల్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు..!!