చరణ్ కు డాక్టరేట్.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఇటీవల వైల్స్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో గౌరవ డాక్టరేట్‌ పురస్కారాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు సాయంత్రం జరగబోయే ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో రామ్ చరణ్ పాల్గొని సందడి చేయనున్నారు. ఈ ఈవెంట్‌లో చ‌ర‌ణ్‌కు డాక్టరేట్ ప్రధానం చేయనున్నారు. ఇక ఇటీవల ఈ విషయాన్ని యూనివర్సిటీ స్వయంగా ప్రకటించడంతో.. మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ మంచి సక్సెస్ తో దూసుకుపోతున్న రామ్ చరణ్.. ఎన్నో అవార్డులను అందుకున్నారు.

నటుడుగానే కాకుండా పర్సనల్ గాను ఎంతో మందికి అండగా నిలిచిన రామ్ చరణ్.. ప్రస్తుతం వేల్స్ యూనివర్సిటీ ఆధ్వ‌ర్యంలో డాక్టరేట్ అందుకుంటున్న నేప‌ద్యంలో చరణ్.. బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. సినీ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో రాణిస్తున్న శ్రీ రామ్ చరణ్‌కి గౌరవ డాక్టరేట్ ద‌క్క‌డం నాకు సంతోషాన్ని కలిగిస్తోంది. శ్రీ రామ్ చరణ్‌కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా అంటూ పవన్ కళ్యాణ్ రాసుకోచ్చాడు.


అలాగే చెన్నై వేల్స్ యూనివర్సిటీ చరణ్ సినీ ఇండస్ట్రీకి చేస్తున్న సేవలకు, ప్రతిభకు ప్రత్యేకంగా ఈ డాక్టరేట్‌ ఇవ్వడం సంతోషకరమైన పరిణామం అంటూ.. డాక్టరేట్‌ అందుకున్న స్ఫూర్తితో రామ్ చరణ్ మరిన్ని విజయవంతమైన సినిమాలలో నటించాలి.. మరిన్ని పురస్కారాలను అందుకోవాలి.. ప్రజాభిమానాన్ని పొందాలని కోరుకుంటున్నా.. అంటూ పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేస్తూ రామ్ చరణ్ గురించి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. డాక్టరేట్‌కి అభినందనలు తెలియజేస్తూ పవన్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. అయితే గతంలో యూనివర్సిటీ నుంచి పవన్ కళ్యాణ్ కు కూడా డాక్టరేట్ ప్రకటించగా ఆయన దానిని తిరస్కరించిన సంగతి తెలిసిందే.