నన్ను రిజెక్ట్ చేసిన వారందరికీ నా ధన్యవాదాలు.. మృణాల్ ఠాగూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..

మొదట హిందీ సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన మృణాల్‌ తర్వాత బాలీవుడ్ హీరోయిన్గా ఛాన్స్ అందుకొని అక్కడ సినిమాల్లో నటించింది. ఇక హను రాఘవపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన సీతారామం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా తెర‌కెక్కిన ఈ మూఈలో అచ్చతెలుగు ఆడపిల్లగా తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. టాలీవుడ్ ఈమె నటించిన మొదటి సినిమానే సక్సెస్ కావడం భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. తర్వాత నాని హీరోగా వ‌చ్చిన హాయ్ నాన్న సినిమాతో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకోవడంతో లక్కీ హీరోయిన్గా క్రేజ్‌ సంపాదించుకుంది.

మృణాల్‌ ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ల‌లో నటిస్తూ కెరీర్ ప‌రంగా బిజీగా గడుపుతుంది. ఇక‌ ఈ అమ్మడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసింది. తన కెరీర్ తొలినాళ‌ను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది. ఇప్పటివరకు తెలుగు, హిందీ, మరాఠీ బాష‌లో ప‌లు సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే తెలుగులో ఆమె నటించిన సీతారామమ‌ సినిమా ఎప్పుడు మనసుకు హత్తుకునే సినిమా అంటూ వివరించింది. నటీనటులు పాత్రలో లీనమైతేనే అవి ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయని.. మనం జీవించినట్లే పాత్రలో న‌టించాల‌ని. సీతా రామం మూవీలో నా పాత్ర కోసం నేను అలాగే శ్రమించానని.. ఇప్పటికీ ప్రేక్షకులు నన్ను సీతామహాలక్ష్మిగా గుండెల్లో పెట్టుకున్నారంటూ చెప్పుకొచ్చింది.

కెరీర్ స్టార్టింగ్ లో చాలామంది ఈమెకు నటన రాదు.. ఈమె నటనకు పనికిరాదు అంటూ హేళనగా మాట్లాడారని.. త‌న‌ను తిరస్కరించారని వివ‌రించిన మృణాల్.. నేను దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ వివరించింది. నేను నటన‌కు పనికిరాన‌ని వాళ్ళు అన్నారు కాబట్టే నాలో పట్టుదల‌, క‌సి మరింతగా పెరిగాయి. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా.. ఎంతోమంది అభిమానులను దక్కించుకున్న అంటూ వివరించింది. నటి,నటుల‌ మధ్య గట్టి పోటీ ఉండడంలో తప్పేం లేదంటూ ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఇటీవల నటించిన ఫ్యామిలీ స్టార్‌ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ.. ఈ పాత్రకు నేను 100% న్యాయం చేశానని.. న‌ట‌న పరంగా త‌ను చేసే ప్రతి పాత్ర ఎప్పటికి ఆమెకు గుర్తుండిపోతోంది అంటూ వివరించింది.