రాగి వస్తువులను ధరించడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా.. తప్పక తెలుసుకోండి..

సాధారణంగా వెండి, బంగారం, వజ్రాలతో తయారుచేసిన ఆభరణాలను అంద‌రు ఎక్కువగా ధరించ‌డానికి ఇష్ట ప‌డుతూ ఉంటారు. వాటిని ధ‌రిస్తారు. అయితే చాలా తక్కువ మంది మాత్రమే రాగితో తయారు చేసిన వస్తువులను అభ‌ర‌ణాల‌గా అలంక‌రించుకుంటారు. అయితే రాగి ఉంగరాలు, బ్రాస్లెట్ లాంటి ఆభ‌ర‌ణాలు ధ‌రించ‌టం వ‌ల్ల‌ సూర్యకిరణాల కారణంగా ఏర్పడే బ్యాధుల‌కు రాగి చెక్ పెడుతుంది. రాగి కడియాలు లేదా ఉంగరాలు వేసుకోవ‌టం వ‌ల్ల‌ కండరాలమ వాపు, కీళ్ల నొప్పులకు ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. పొట్ట సమస్యలను అరిక‌ట్ట‌వ‌చ్చు. కాపర్ రింగ్ లేదా బ్రాస్‌లెట్ ధరించడం ద్వారా కీళ్ల నొప్పులనుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

దీంతో పాటు రాగి ఆభరణాలు ధరించడం వల్ల ఉదర సంబంధిత వ్యాధులను కూడా అరిక‌ట్ట‌వ‌చ్చు. ఆర్థరైటిస్‌ రోగులు తప్పనిసరిగా రాగి కంకణం ధరించడం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. సూర్య,అంగారక దోషాలు తొలగిపోతాయ‌ట‌. ఉంగరపు వేలిలో రాగి ఉంగరాన్ని పెట్టుకోవ‌డం వ‌ల్ల‌ సూర్య దోషం తొలగిపోవ‌టంతో పాటు.. అంగారక గ్రహం దుష్ప్రభావాల నుండి కూడా రిలీఫ్ వ‌స్తుంది. సరైన రక్త ప్రసరణ కోసం.. రాగి ఉంగరం లేదా బ్రాస్లెట్ ధరించడం మంచిది. దీని వ‌ల్ల‌ రక్తం శుభ్రపడుతుంది.

బ్ల‌డ్ స‌ర్కిలేష‌న్ బాగా జరుగుతుంది. దీన్ని ధరించడం వల్ల మానసిక, శారీరక ఒత్తిడినుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. రాగి పాత్రలో నీటిని తాగ‌టం వ‌ల్ల కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. రాగి వాస్తు దోషాలు తొలగిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఉంచిన రాగి పాత్రలు ఆనందం, శాంతిని పెంపొందిస్తాయి. దాని స్వచ్ఛత సానుకూల శక్తి ప్రవాహాన్ని ప్రోత్స‌హిస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం తప్పు దిశలో ఉన్న‌పుడు.. రాగి నాణేన్ని వేలాడదీయడం వల్ల వాస్తు దోషం తొలగిపోతుందని నిపుణులు చెబుతారు.