ఆ యంగ్ హీరోకి సపోర్ట్ గా మహేష్ బాబు.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..?!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం సినిమాతో యావ‌రేజ్ టాక్‌ సంపాదించిన‌ సంగతి తెలిసిందే. త్రివిక్రమ్, మహేష్ కాంబోలో మూడో సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి అంచనాల నడుమ రిలీజైనా.. ఊహించిన రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ కాలేకపోయింది. ఇప్పుడు సూపర్ స్టార్, దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో పాన్ వ‌ర‌ల్డ్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా మహేష్ బాబు యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండకు సపోర్ట్ గా నిలిచాడు. అతను నటిస్తున్న లేటెస్ట్ మూవీ భజే వాయువేగం మూవీ మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.

సినిమా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా.. కార్తికేయ, డైరెక్టర్ ప్రశాంత్, మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అంటూ మహేష్ బాబు తన ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకున్నాడు. దాంతో మహేష్ లేటెస్ట్ పోస్ట్ కాస్తా వైరల్ గా మారింది. కార్తికేయ కొత్త సినిమాకు మహేష్ చేసిన పోస్ట్ చాలా ప్లస్ అయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. యూవి క్రియేషన్స్ బ్యానర్ లో హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటించనుంది. ఇక హ్యాపీడేస్ మూవీ టైసన్ క్యారెక్టర్ లో నటించిన రాహుల్.. ఓ కీలక పాత్రలో నటించనున్నాడు. ఈ మూవీకి ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. అజయ్ కుమార్ రాజు. పి కోప్రొడ్యూసర్గా సినిమాను రూపొందిస్తున్నాడు.

ఈ భజే వాయు వేగం సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లో క్రికెట్ బ్యాట్ తో హీరో కార్తికేయ వేగంగా పరుగులు పెడుతున్నట్లు కనిపిస్తుంది. మరోవైపు ఎక్కువ మొత్తంలో డబ్బు ఎగురుతున్నట్లు ఈ పోస్టర్ ను డిజైన్ చేశారు. దీంతో ఫస్ట్ లుక్ పోస్టర్ భజే వాయువేగం సినిమా మీద ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తుంది. అయితే ఫ్రెష్ కంటెంట్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధంగా సినిమాను రూపొందిస్తున్నారు. త్వ‌ర‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వా తదితరులు కీలకపాత్రలో నేర్పించనున్నారు. ఇటీవల బెదురులంక 2012 సినిమాతో యావరేజ్ హిట్ అందుకున్న కార్తికేయ ప్రస్తుతం నటిస్తున్న భజే వాయువేగంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవాలని కసితో ఉన్నాడు.