పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మంచు మనోజ్ , మౌనిక దంపతులు.. పేరు కూడా పెట్టేశారుగా..?!

మంచు ఫ్యామిలీ లోకి మరో కొత్త ఫ్యామిలి మెంబ‌ర్‌ చేరారు. హీరో మంచు మనోజ్ భార్య మౌనిక తాజాగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మంచు లక్ష్మి అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఇప్పటికే మనోజ్, మౌనిక దంపతులకు ఓ కొడుకు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ దంపతులకు ఆడపిల్ల పుట్టింది. మనోజ్, మానిక గతంలో వేరువేరు పెళ్లిళ్లు చేసుకోగా ఏవో మనస్పర్ధలతో ఇద్దరు వాళ్ళ‌తో విడాకులు తీసుకున్నారు. అయితే విడాకుల తర్వాత వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుని గత ఏడాది కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్గా వివాహం చేసుకున్నారు.

కొన్ని నెలల క్రితం మంచు మనోజ్.. మౌనిక ప్రెగ్నెన్సీ విషయాన్ని అనౌన్స్ చేశారు. మౌనిక బేబీ బంప్ తో ఉన్న ఫొటోస్‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేసుకున్నారు. అలానే సీమంతం వేడుక కూడా నెట్టింట వైరల్ గా మారింది. అయితే తాజాగా ఈ జంటకు పాప పుట్టినా విషయాన్ని మంచు లక్ష్మీ అధికారికంగా ప్రకటించింది. ఇక మంచు మనోజ్‌కు పాప పుట్టింది అంటూ ఇన్స్టా వేదికగా మంచు లక్ష్మి షేర్ చేసుకుంటూ.. మనోజ్ కుటుంబంలో ఇప్పుడు మరో వ్యక్తి యాడ్ అయింది.

గాడ్ బ్లెస్సింగ్స్ తో మౌనిక ఆడబిడ్డకు జన్మనిచ్చింది.. ధైర్యవ్‌ నేడు అన్నయ్య అయ్యాడు అంటూ రాసుకొచ్చింది. ఇక ఆ పాపాను ఓ పేరుతో పిలుచుకుంటారో కూడా మంచు ల‌క్ష్మి రాసుకొచ్చింది. మేము ముద్దుగా ఈ పాపను ఎం. ఎం. పులి అని పిలుచుకుంటాం అంటూ మంచు లక్ష్మి వెల్ల‌డించింది. ఆ శివుని దయతో మా కుటుంబం ఎప్పుడూ చల్లగా ఉండాలని మంచు లక్ష్మి ఈ పోస్టులో షేర్ చేసుకుంది. మనోజ్‌కు బంధుమిత్రులు, అభిమానులతో పాటు పలువురు సినీ సెలబ్రిటీస్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.