ఈ బురి బుగ్గల చిన్నది ఇప్పుడు టాలీవుడ్ క్యూట్ హీరోయిన్.. భర్త కూడా స్టార్ నటుడే.. ఎవరో గుర్తుపట్టారా..?!

సినీ ఇండస్ట్రీలో నటీనటుల హీరో, హీరోయిన్ల చైల్డ్హుడ్ పిక్స్ నెటింట ఎప్ప‌టిక‌ప్పుడు తెగ వైరల్ అవుతూనే ఉన్నాయి. తమ ఫేవరెట్ సెలబ్రిటీల చిన్ననాటి పిక్స్ కనిపిస్తే చాలు వారి ఫ్యాన్స్ కూడా తమ ఆ ఫోటోలను సోషల్ మీడియావేదిక గా షేర్ చేస్తూ తెగ ట్రెండ్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. అలా ప్రస్తుతం ఈ పై ఫోటోలో బొద్దుగా ముద్దులొలికే బుగ్గలతో కనిపిస్తున్న చిన్నది.. ప్రస్తుతం ఒక క్యూట్ హీరోయిన్. మలయాళం, తెలుగు, త‌మిళ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో హీరోయిన్గా నటించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ ఏర్పరచుకుంది. వెండితెరపై ఈమె కనిపిస్తే చాలు ప్రేక్షకులు ఆమె క్యూట్ నెస్‌కు అట్రాక్ట్ అయిపోతారు.

ముద్దు ముద్దు ఎక్స్ప్రెషన్స్ తో మాయ చేసే ఈ ముద్దుగుమ్మ.. చాలామంది యువతకు అభిమాన హీరోయిన్. ఇక ఎమోషన్స్ సీన్స్ లో చెలరేగిపోయి మరి నటించే ఈ చిన్నది ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా. ఆమె మరెవరో కాదు రాజా రాణి తో సంచలనాన్ని సృష్టించిన నాజ్రియా నసీమా. 1994 డిసెంబర్ 28 పుట్టిన ఈ చిన్నది బాలనటిగా పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఆపై ఓ టీవీ షోలో ఫాస్ట్ గా వ్యవహరించి తర్వాత హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.
మలయాళ స్టార్ హీరోయిన్గా పాపులారిటి దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో నాచురల్ స్టార్ నాని సరసన అంటే సుందరానికి.. సినిమాలో నటించి మెప్పించింది.

ఆమె భ‌ర్త ఫ‌హ‌ద్ కూడా ఇండ‌స్ట్రీలో మంచి పాపులారిటీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా తెర‌కెక్కిన పుష్పా లో విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఫహద్. ఇక నజ్రియా వివాహం తర్వాత చాలా సెలెక్టివ్ గా సినిమాల్లో ఎంచుకుంటూ నటిస్తోంది. నాని అంటే సుందరానికి.. తర్వాత రెండేళ్ల పాటు ఖాళీగానే ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల సూర్య 43 సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ప్రేక్షకుల్లో ఆశ‌క్తి నెలకొల్పింది. కచ్చితంగా ఈమె ఒక కథను ఒప్పుకుందంటే సినిమాలో ఏదో విషయం ఉండే ఉంటుందని ప్రేక్షకుల అభిప్రాయం. తెలుగు సినిమాల్లో కూడా న‌జ్రియా నటిస్తే బాగుంటుందని అభిమానులు తమ అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటారు.