అతనికి మూడు పెళ్లిళ్లు అయ్యాయి పర్వాలేదుగా.. పూనమ్ కౌర్ కామెంట్స్ వైరల్..

టాలీవుడ్ బ్యూటీ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె నటించింది అతి తక్కువ సినిమాలైనా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మ‌డు.. ఎప్పటికప్పుడు కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తు నెటింట‌ వైరల్ గా మారుతూనే ఉంటుంది. సినిమాల కంటే వివాధాల‌తోనే బాగా పాపులారిటి ద‌క్కించుకున్న ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికగా త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్‌ల‌ను టార్గెట్ చేస్తూ పరోక్షంగా విమ‌ర్శిస్తూ పోస్ట్లు పెడుతూ పాపులారిటీ దక్కించుకుంది. ఇక తాజాగా ఏపీ ఎన్నికల నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై ప్రశంసలు కురిపించింది.

అలాగే పవన్ కళ్యాణ్‌పై పరోక్షంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ సెటైరికల్ కామెంట్లు చేసి నెట్టింట సంచలనంగా మారింది. సోషల్ మీడియా వేదికగా ఓ నెటిజ‌న్ చేసిన పోస్ట్పై స్బందిస్తూ ఆమె చేసిన‌ కామెంట్స్ నెటింట‌ వైరల్ గా మారాయి. వైసీపీ ప్రభుత్వ సానుభూతిపరుడుగా ఆ నెటిజన్ ఆంధ్రప్రదేశ్‌లో టెస్లా కార్ల కంపెనీ ఏర్పాటు చేయాలని మాస్కిన్ ను రిక్వెస్ట్ చేస్తూ పోస్ట్ షేర్ చేశాడు.

అయితే ఆ వ్యక్తి లండన్ లో డాక్టర్ అని తెలుస్తోంది. ఆయన చేసిన ఈ ట్విట్ ను కోట్ చేస్తూ అతనికి మూడు పెళ్లిళ్లు.. ఏం పర్లేదుగా అంటూ సెటైరిక‌ల్ కామెంట్స్ షేర్ చేసింది. వైసీపీ నేతలు తరచు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు పై విమర్శిస్తూనే ఉంటారు.. స్వయంగా వైసిపి అధినేత ఏపీ ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే ఎన్నోసార్లు పవన్ మూడు పెళ్లిళ్లు ప్రస్తావని తీసుకువచ్చి హేళన చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎలెన్‌ మాస్కిన్‌కు కూడా మూడు పెళ్లిళ్లు కావడంతో.. ఆయనకు మూడు పెళ్ళిళ్ళు. అయిన పర్లేదా.. అంటూ పరోక్షంగా పవన్ పై పూనమ్‌ కామెంట్స్ చేసిందంటూ సమాచారం.