పవర్ స్టార్ రిజెక్ట్ చేసిన కథలతో సూపర్ హిట్ లు అందుకున్న ఆ యంగ్ హీరో ఎవరో తెలుసా..?!

సినీ ఇండస్ట్రీలో ఓ హీరో చేయవలసిన సినిమాను మరో హీరో చేసి సూపర్ సక్సెస్ సాధించిన సందర్భాలు, డిజాస్టర్ లను ఖాతాలో వేసుకున్న సందర్భాలు ఎన్నో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి క్రమంలో మొదటి సినిమాను వదులుకున్న హీరో జడ్జిమెంట్ కీలకంగా ఉంటుంది. ఆ హీరో స్టోరీ విన్న తర్వాత స్టోరీ ను రిజెక్ట్ చేస్తే.. హిట్ అయితే మాత్రం ఎంతో నష్టపోయినట్లు అవుతుంది. ఒకవేళ అది ప్లాప్ అయితే డిజాస్టర్ నుంచి ఆ హీరో బయటపడినట్లు అవుతుంది. అయితేకొంత మంది స్టార్స్ మాత్రం కథ నచ్చిన ఆ సినిమాకు తాము సెట్ కామనే ఉద్దేశంతో సినిమాలను వదిలేస్తూ ఉంటారు.

Pawan Kalyan backing Nithin for his next film?

అలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కొన్ని సినిమాలను రిజెక్ట్ చేశారు. ఈ క్రమంలో పవన్ రిజెక్ట్ చేసిన ఆ సినిమాలలో ఓ యంగ్ హీరో నటించిన వరుస విజయాలను అందుకున్నాడు. ఇంతకీ పవన్ రిజెక్ట్ చేసిన ఆ సినిమాలు ఏంటో.. ఆ సినిమాలను చేసి సక్సెస్ సాధించిన యంగ్ హీరో ఎవరో ఒకసారి చూద్దాం. ఆయన ఎవరో కాదు పవర్ స్టార్ వీరాభిమాని నితిన్. పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన రెండు సినిమాలను నితిన్ హీరోగా నటించిన సక్సెస్ అందుకున్నాడు.

A Aa Full Movie Download Flash Sales | www.ghanamedj.org

అందులో మొదటిది త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన అ ఆ. రెండోది కృష్ణ చైతన్య డైరెక్షన్లో.. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించిన ఛ‌ల్ మోహనరంగా. ఈ రెండు సినిమాలు కూడా మొదట పవన్ కళ్యాణ్ తో చేయాలని త్రివిక్రమ్ భావించారట. అయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమాలు తనకు సెట్ అవ్వవనే ఉద్దేశంతో వాటిని వదులుకోవడం.. దీంతో నితిన్ తో ఆ సినిమా తెరకెక్కించడం జరిగింది. అయితే అలా నితిన్ నటించిన ఈ రెండు సినిమాల్లో అఆ బ్లాక్ బాస్టర్ సక్సెస్ కాగా. ఛ‌ల్ మోహన్ రంగా యావరేజ్ రిజల్ట్ అందుకుంది.