హనూరాఘవపూడి-ప్రభాస్ కాంబోలో రాబోయే సినిమా ఆ హీరో బయోపికా..? డైరెక్టర్ సంచలన కామెంట్స్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రెసెంట్ కల్కి అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మే 30వ తేదీ రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తుంది . అదే విధంగా మారుతీ దర్శకత్వంలో ది రాజా సాబ్ అనే సినిమా షూట్ లోను బిజీ అవుతున్నాడు . ఈ రెండు షూటింగ్ కంప్లీట్ అవ్వగానే సలార్ 2 ని సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు ప్రభాస్.

అలాగే స్పిరిట్ సినిమాని కూడా సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు . పెర్లర్గా ఈ సినిమాతో పాటే హను రాఘవపూడి దర్శకత్వంలో కూడా ఒక సినిమాని ఫిక్స్ అయ్యాడు ప్రభాస్ . దీనిపై రీసెంట్గా హనురాగవపూడి స్పందించాడు . ఓ ప్రైవేటు ఫంక్షన్ లో తలుక్కుమని మెరిసిన హనురాఘవపూడి ప్రభాస్ తో సినిమా చేస్తున్న విషయాన్ని కన్ఫామ్ చేశాడు . అంతేకాదు ఆయన ప్రభాస్తో చేయబోయే సినిమా కథకు సంబంధించిన డీటెయిల్స్ ని కూడా బయట పెట్టాడు .

నిన్న మొన్నటి వరకు ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చే సినిమా ఒక స్టార్ హీరో మూవీకి బయోపిక్ అంటూ చెప్పుకొచ్చారు . అయితే అదంతా ఫేక్ అంటూ కొట్టి పడేసాడు హను రాఘవపూడి ..నా అప్కమింగ్ ఫిలిం ప్రభాస్ తోనే .. అది ఓ పీరియడ్ యాక్షన్ డ్రామా ఇది చారిత్రక ఫిక్షన్ చిత్రం. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే మూడు పాటలు కూడా కంప్లీట్ చేసేసాం “అంటూ చెప్పుకొచ్చారు . ఈ స్టేట్మెంట్తో హను రాఘవపూడి సినిమా హ్య్స్ష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నయ్..!!