తారక్ నటించిన సినిమాలలో చిరంజీవికి నచ్చిన సినిమా ఏంటో తెలుసా.. ఎన్టీఆర్ తల్లికి కూడా అదే ఫేవరెట్ మూవీ..?!

టాలీవుడ్‌లో మెగాస్టార్‌ చిరంజీవికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిరంజీవి దాదాపు నాలుగు శతాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మెగాస్టార్.. పద్మభూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలను అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి వశిష్ట డైరెక్షన్లో విశ్వంభ‌రా సినిమాలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో వ‌శిష్ఠ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఇండస్ట్రీలో చిరంజీవికి నచ్చిన యంగ్ హీరోలలో ఎన్టీఆర్ కూడా ఒకరన సంగతి తెలిసిందే. అయితే చిరుకి.. ఎన్టీఆర్ చేసిన అన్ని సినిమాలలో ఆ సినిమా మోస్ట్ ఫేవరెట్ అంటూ న్యూస్ వైరల్ అవుతుంది.

Temper (2015) - IMDb

ఇంతకీ అంత‌గా ఇష్టమైన సినిమా ఏంటో.. ఆ సినిమా ఎందుకు అంత స్పెషల్ తెలుసుకుందాం. తారక్ నటించిన సినిమాలన్నింటిలో చిరంజీవికి టెంప‌ర్ సినిమా అంటే చాలా ఇష్టమట. ఓ ఆడపిల్ల కోసం ఎన్టీఆర్ వారించిన విధానం.. చిరుకి బాగా న‌చ్చుతుంద‌ట‌. ఈ మూవీలో స్పెషల్ గా కోర్ట్ సీన్ అంటే మరి ఇష్టమని తెలుస్తుంది. అందులో ఎన్టీఆర్ చేసిన యాక్టింగ్ రిపీటెడ్ గా చిరంజీవి చాలాసార్లు చూశానని స్వయంగా వివరించారు. ఇక అంతకు ముందు వరుస ఫెయిల్యూర్ లో ఉన్న ఎన్టీఆర్ టెంపర్ తో త్రో బ్యాక్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే టెంపర్ సినిమా ఎన్టీఆర్ తల్లి శాలినికి కూడా చాలా ఇష్ట‌మ‌ట‌. ఎన్టీఆర్ నటించిన ప్రతి సినిమాను ఆమె చూసినా టెంపర్ సినిమా వచ్చిందంటే ఎన్నిసార్లు అయినా మిస్ కాకుండా చూస్తుందట.

Jr NTR's 'Devara Part 1' release date out, makers announce with new poster  - India Today

త‌న‌కు కూడా ఈ సినిమాల్లో ఎన్టీఆర్ కోర్టులో చెప్పే పవర్ఫుల్ డైలాగ్స్ బాగా నచ్చుతాయని తెలుస్తుంది. ఇలా ఎన్టీఆర్ నటించిన టెంపర్ మూవీ కేవలం తారక్ ఫ్యాన్స్‌కే కాకుండా.. చాలా మంది సెలబ్రిటీస్‌కు కూడా ఇష్టమట్ట. ఎన్టీఆర్ టెంపర్ సక్సెస్ తరువాత వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. టెంపర్ తర్వాత వరుసగా ఐదు సక్సెస్‌లు అందుకున్న తారక్.. రాజమౌళి డైరెక్షన్లో ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం తారక్ దేవర సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అందుకునేందుకు శ్రమిస్తున్నాడు. కొరటాల శివ డైరెక్షన్‌లో తెర‌కెక్కుతున్న ఈ దేవర సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.