సౌందర్య రహస్య వీలునామాలో అలా రాసిందా..? ఇన్నాళ్లకు బయట పడిన నిజం..!

సౌందర్య.. సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్న అందరికీ బాగా నచ్చేసే హీరోయిన్ . ఈమె గురించి ఎంత చెప్పుకున్న తక్కువే .. ఆమె మన మధ్య లేకపోయినప్పటికీ జనాలు ఇప్పటికీ ఆమెను ఆరాధిస్తూ ఉంటారు . ఆమె పేరుని జపిస్తూ ఉంటారు . దానికి కారణం సౌందర్య మంచితనం. సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది హీరోయిన్స్ మాత్రమే ఇలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటూ ఉంటారు. అప్పట్లో మహానటి సావిత్రి గారి తర్వాత సౌందర్య అలాంటి పేరు దక్కించుకుంది. అప్పట్లోనే హ్యూజ్ రెమ్యూనరేషన్ తీసుకునేది సౌందర్య .

అతి చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆమె కెరియర్లో బాగా డబ్బులు సంపాదించింది మంచి మంచి సినిమాల్లో నటిస్తూ తెలుగు తో పాటు తమిళం మలయాళం మొదలైన దక్షిణ భారత భాషలలో ప్రముఖ హీరోలు అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుని శభాష్ అనిపించుకుంది. సౌందర్య కి సంబంధించిన ఒక విషయం బాగా వైరల్ గా మారింది . సౌందర్య చాలా ఆస్తిని కూడ పెట్టిందట .

అయితే ఆమె చనిపోయే సమయానికి ఆమె గర్భవతి .. కోట్ల ఆస్తికి అధిపతిగా ఉన్న సౌందర్య తన మరణానికి ముందే ఆస్తికి సంబంధించిన వీలు నామ రాసేసిందట. ఇదే విషయం వైరల్ గా మారింది . వీలునామాలో తన కోట్ల ఆస్తి మొత్తం కూడా భర్తతోపాటు.. తల్లిదండ్రులకి దక్కేలా రాసిందట . అయితే ఈ విషయంపై తన తల్లి మాత్రం నెగిటివ్గా స్పందించింది . 31 ఏళ్ల వయసులో విలునామా ఎందుకు రాస్తుంది ..? అసలు ఆమె చనిపోతుందని ఆమెకు తెలుసా..? రాయాల్సిన అవసరం ఏంటి..? అంటూ ఫైర్ అయిపోయిందట . ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది. అయితే సౌందర్య చనిపోయిన తర్వాత తన తల్లిదండ్రులకి ఒక్క రూపాయి ఆస్తి ఇవ్వకుండా మొత్తం భర్త నే ఎంజాయ్ చేశాడట..!!