బన్నీ బర్త డే స్పెషల్: అల్లు అర్జున్ టోటల్ ఆస్తి ఎన్ని వేల కోట్లు ఉంటుందో తెలుసా?

అల్లు అర్జున్ .. సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్న పేరు. ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప1 సినిమాలో నటించి పాన్ ఇండియా స్టార్ గా పాపులారిటీ దక్కించుకున్నాడు. ప్రెసెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. బన్నీ బర్త్డ డే సందర్భంగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది .

మరీ ముఖ్యంగా చీర కట్టులో అల్లు అర్జున్ మెరిసిన తీరు అభిమానులకి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది. కాగా బన్నీ బర్త్ డే సందర్భంగా ఆయన టోటల్ ఆస్తుల విలువలకు సంబంధించిన డీటెయిల్స్ నెట్టింట వైరల్ గా మారాయి . 2003లో గంగోత్రి సినిమా ద్వారా హీరోగా తెరంగేట్రం చేసిన ఆయన 20 ఏళ్లకు పైగానే తెలుగు ఆడియోస్ ను అలరిస్తూ వస్తున్నారు. కాగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన బన్నీ టోటల్ ఆస్తులు వేల కోట్లకు పైగానే ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది .

బన్నీ కేవలం సినిమాలోనే కాదు పలు యాడ్స్ లో కూడా నటించి రెండు చేతుల్లా సంపాదిస్తున్నారు . అదే విధంగా అల్లు ఫ్యామిలి నుంచి వచ్చిన ఆస్తులు కూడా ఆయనకు బాగా కలిసొచ్చాయి . అంతేకాదు బన్నీ – స్నేహ రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు . స్నేహ రెడ్డి తెలంగాణ పొలిటిషియన్ కూతురు అన్న విషయం కూడా తెలిసిందే. మరోపక్క ఆ విధంగా కూడా ఆస్తులు వచ్చాయి . ఒక్కొక్క సినిమాకి 100 కోట్లు తీసుకుంటున్న అల్లు అర్జున్ త్వరలోనే ఆ రెమ్యూనరేషన్ 200 కోట్లు చేసే స్థాయికి ఎదిగిపోతాడు అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!