రౌడీలా ఉన్న.. ఎన్టీఆర్ ని ఒకేఒక్క సినిమాతో స్టార్ హీరో చేసిన డైరెక్టర్ ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు నటించిన ఒక్క సినిమాతో అయినా సక్సెస్ కాకపోతే వాళ్లు స్టార్ హీరో ఇమేజ్ క్రియేట్ చేసుకోలేరు అనేది వాస్తవం. అలాగే కేవలం ఒకే ఒక్క హిట్‌తో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న వారు చాలామంది ఉన్నారు. ఇక అసలు విషయం ఏంటంటే వి.వి. .వినాయక డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన మొదటి మూవీ ‘ ఆది ‘. ఈ మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలుసు. ఈ సినిమాకు సంబంధించిన మొదటి చర్చ జూనియర్ ఎన్టీఆర్.. స్టూడెంట్ నెంబర్ 1 షూటింగ్ టైంలో జరిగిందట. స్విట్జర్లాండ్ లో ఈ సినిమా షూటింగ్ పూర్తయి.. భారత్‌కు బయలుదేరుతున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు ఇద్దరు వ్యక్తులు వెళ్లారు. వారిలో మన అందరికీ తెలిసిన బుజ్జి, వి.వి.వినాయ‌క్‌ ఉన్నారు. అలా వెళ్లిన వీరిద్దరు జూనియర్ ఎన్టీఆర్ ను కలిసి మా దగ్గర మీకు సరిపోయే కదా ఒకటి ఉందంటూ వివరించారట.

అయితే ఎన్టీఆర్ వెంటనే మీరు నన్ను హైదరాబాదులో కలవండి అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. కొద్ది రోజులకు వి.వి.వినాయక్, బుజ్జి.. ఎన్టీఆర్ చెప్పినట్లే హైదరాబాద్ వెళ్లి తార‌క్‌ను కలిసారట. అయితే ఆ టైంలో ఎన్టీఆర్ ని చూసి చూడడానికి రౌడీలా ఉన్నాడు. ఇతనితో సినిమా తీసి హిట్ కొట్టగలనా అని భావించాడట. పరిస్థితి ఎలా ఉన్నా ఈయనకు కథ చెప్పక తప్పదు. అని వి.వి.వినాయక్ స్టోరీ చెప్పడానికి సిద్ధమయ్యాడు. అయితే ఆ టైంలో ఎన్టీఆర్ తనకు కథ మొత్తం చెప్పాల్సిన పనిలేదు.. కేవలం ఇంట్రడక్షన్ ఇంటర్వెల్, క్లైమాక్స్ చెప్తే సరిపోతుంది అని చెప్పాడట. నేను మొదట కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే చెబుతాను. అది మీకు నచ్చిందనిపిస్తే మిగతా కథను వినిపిస్తాను అంటూ చెప్పుకొచ్చాడట. అలా ఏకంగా రెండు గంటలు పాటు పూర్తి కథను విన్న ఎన్టీఆర్ ఈ సినిమాను మనం చేస్తున్నామని చెప్పి వెళ్ళిపోయారు.

ఈ న్యూస్ అప్ప‌ట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది. అయితే కొద్ది రోజులకు ఎన్టీఆర్ నుండి ఒక పిలుపు వచ్చింది. దాంతో ఆయన వెంటనే ఎన్టీఆర్ ని కలవడానికి వెళ్లారట. ఇప్పుడు నాకు లవ్ స్టోరీస్ చేయడం ఇంట్రెస్ట్ లేదు. ఏదైనా మాస్ కథ‌ ఉంటే చెప్పమని అడిగారట తారక్. వెంటనే ఇది వరకు తాను అనుకున్న కొన్ని సీన్లను ఎన్టీఆర్‌కు చెప్పడం.. అందులో చిన్నపిల్లాడు బాంబులు వేయడం, ఫ్యాక్షన్ లాంటి అంశాలను చెప్పడంతో తనకు ఫ్యాక్షన్‌ సినిమాలు హెవి అవుతాయేమో అని భావించారట తారక్. తనుకు అవకాశం ఇవ్వడం ఇష్టం లేక వదిలించుకోవడానికి అలా తారక్‌ మాట్లాడుతున్నారని భావించినా టైం ఇవ్వండి అని చెప్పి కేవలం 7 రోజుల్లో ఏకంగా 58 పేజీలో స్క్రిప్ ను రెడీ చేశాడట వినాయక్‌. ఎన్టీఆర్‌కు ఆ క‌థ వివరించగా ఎన్టీఆర్ ఈ సినిమాను ఎట్టి పరిస్థితిలో మనమే తీర్థం అంటూ వి.వి.వినాయక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆ తర్వాత ఆది సినిమా రిలీజ్ అయింది. టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచి తారక్ కెరీర్ ను మలుపు తిప్పింది.