ఆ ఒక్క మాటతో అందరి నోర్లు మూయించిన విజయ్ దేవరకొండ..దట్ ఈజ్ రౌడీ హీరో..!

విజయ్ దేవరకొండ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. పెళ్లిచూపులు సినిమాతో ఆయన ఎంత క్లాస్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు అర్జున్ రెడ్డి సినిమాతో మాస్ హీరోగా బాగా గుర్తింపు సంపాదించుకున్నాడు. రీసెంట్గా విజయ్ దేవరకొండ నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్ . పరశురాం దర్శకత్వంలో దిల్ రాజు ఎంతో ఇష్టంగా నిర్మించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది . ఏప్రిల్ 5వ తేదీ ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .

ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు విజయ్ దేవరకొండ. రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తమిళనాడు వెళ్ళిన ఆయన అక్కడ పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు . విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ..”అన్ని టైటిల్స్ అందరూ తీసేసుకున్నారు ..తల – తలైవా – సూపర్ స్టార్ ఇలా చాలా టైటిల్స్ అందరూ ముందుగానే పెట్టేసుకున్నారు. పేరుకు ముందు ఏదో ఒక ట్యాగ్ పెట్టుకొని పిలవడం ఫ్యాన్స్ కి మొదటి నుంచి నచ్చుతుంది ..నాతో సినిమాలు తీసే కొందరు నిర్మాతలు లాస్ట్ కొన్ని సినిమాల నుంచి నా పేరు ముందు కూడా ఏదో ఒక ట్యాగ్ పెట్టుకోమని బాగా ప్రెజర్ పెడుతున్నారు”..

” కొన్ని టైటిల్స్ కూడా సజెస్ట్ చేశారు.. కానీ నాకు అవి ఏవి నచ్చలేదు .. అందుకే ఎవరికి ఇబ్బంది కరం కాకుండా నాకు ఎబ్బెట్టుగా అనిపించకుండా ..సింపుల్గా ది అని యాడ్ చేసుకున్నాను..ది విజయ్ దేవరకొండ చాలా సింపుల్ గా ఉంటుంది గా ..బాగుందిగా నాకు అదే ఇష్టం.. ఇక మిగతా ఎలాంటి ట్యాగ్స్ వద్దు అంటూ తనదైన స్టైల్ లో స్పందించాడు విజయ్ దేవరకొండ”. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో ఖుషి సినిమా మూమెంట్లో ది విజయ్ దేవరకొండ ట్యాగ్ పై పలువురు ఎలా ఆయనను ట్రోల్ చేశారో మనకు తెలిసిందే. సింపుల్గా అందరి నోర్లను ఒక్క మాటతో మూయించేశాడు విజయ్ దేవరకొండ..!