మొదటిరోజు కలెక్షన్స్ సునామి సృష్టించిన టిల్లు స్క్వేర్.. ఎన్ని కోట్లు రాబట్టిందంటే..!

ఎన్నో అంచనాలను నడుమ మార్చి 29న విడుదలైన టిల్లు స్క్వేర్ ప్రస్తుతం థియేటర్లలో సంచలనం సృష్టిస్తుంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ హీరోయిన్గా నటించిన ఈ మూవీకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ క్రేజీ ఎంటర్టైనర్ మూవీ అడ్వాన్స్ బుకింగ్ మరియు ప్రీమియర్ షోస్ ద్వారా భారీ కలెక్షన్స్ రాబట్టింది.

కానీ వీటన్నిటికీ మించి మొదటి రోజు కలెక్షన్స్ సునామి సృష్టించాడు టిల్లు. ఇక నిర్మాత నాగవంశీ చెప్పినట్లుగానే మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ ని నమోదు చేయడం విశేషం. కాగా వరల్డ్ వైడ్ గా టిల్లు స్క్వేర్ ఏకంగా 23.7 కోట్ల గ్రాస్ ని రాబట్టి ఒక సెన్సేషన్ సృష్టించిందని చెప్పవచ్చు.

ఇది సిద్దు సినిమాల్లో హైయెస్ట్ గ్రాస్. మొత్తానికి అయితే తొలి రోజున మీడియం రేంజ్ హీరోలా స్థాయిలో టిల్లు స్క్వేర్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తుంది. ఏకంగా నైజాం ఏరియాలో సిద్దు తన టాలీవుడ్ యువ హీరోలకు గట్టి పోటీ ఇచ్చాడు. ఎందుకంటే అక్కడ ఏరియాలో తొలి రోజున నాని దసరా మూవీ రూ. 6.78 కోట్లు సాధించగా విజయ్ దేవరకొండ ఖుషి మూవీ రూ.5.15 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇక వీటన్నిటిని తలదన్నింది టిల్లు స్క్వేర్.