టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పాటు చేసుకున్న పవన్‌తో సినిమాలు నటించాలని చాలామంది హీరోయిన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. అలా పవన్ కళ్యాణ్‌తో నటించే ఛాన్స్ దొరికితే నటనలో వాళ్ళ సత్తా చాటుకుంటారు. అలా పవన్ కళ్యాణ్ సరసన హిట్ సినిమాలో నటించిన ఓ టాలెంటెడ్ హీరోయిన్ ఏకంగా 6 భాషల్లో అనర్గళంగా మాట్లాడుతుందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు. అది ఏ సినిమానో తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు జనరేషన్‌ల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.
యువతలో తన క్రేజ్ అంతకంతకు రెట్టింపు చేసుకుంటున్న పవర్ స్టార్.. ఇప్పటికీ ఫ్యాన్స్ లో తన సినిమాలపై ఆశక్తి కల్పిస్తూనే ఉన్నాడు. అలాగే తన సినిమాలో నటించేందుకు యంగ్ హీరోయిన్లకు కూడా ఛాన్సలిస్తూనే ఉన్నాడు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అసలు విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ తాను నటించడం భీమ్లా నాయక్ సినిమాతో మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా నిత్యం మీనన్ నటించిన సంగతి తెలిసిందే.
ఈ మూవీలో వీరిద్దరి కెమిస్ట్రీ కూడా ఫ్యాన్స్, ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే పవన్ కళ్యాణ్ హీరోయిన్ నిత్యమీనన్ ఏకంగా 6 భాషల్లో అనర్గళంగా మాట్లాడుతుందట. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ, ఇంగ్లీష్ లో అవలీలగా మాట్లాడగలరని తెలుస్తుంది. ఈ భాషల్లో నటించే సినిమాలకు తానే స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంటదట. ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట వైరల్ అవ్వడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. వామ్మో నిత్యామీనన్ ఏకంగా ఇన్ని భాషలు మాట్లాడుతుందా.. డబ్బింగ్ కూడా తానే చెప్పుకోవడం నిజంగా గ్రేట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.