కల్కి తో కాలు దువ్వుతున్న పుష్ప 2… విజయం ఎవరిది..?

ప్రభాస్ అంటేనే ఇండస్ట్రీలో మంచి పేరు గల వ్యక్తి. ఇక అల్లు అర్జున్ గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లోనే ఎన్నో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం మన టాలీవుడ్ నుండి రాబోతున్న సినిమాల్లో కల్కి, పుష్ప 2 కూడా ఒకటి..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న” పుష్ప2″ అలాగే పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన” కల్కి 2898 AD కూడా ఒకటి. ఇక ఈ రెండు సినిమాలని కూడా వీలైనన్ని భాషల్లో తెరకెక్కించనున్నారు.

అయితే ఆల్రెడీ పుష్ప 2 ఆగస్టు 15 డేట్ ని ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. కల్కి కి రిలీజ్ అవుతున్న మే నెలలోనే సరిగ్గా వారం కూడా కాదు ఆ కొన్ని రోజుల్లోనే ఎన్నికలు ఉంటాయని కన్ఫర్మ్ కావటంతో కల్కి వాయిదా ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఇప్పుడు కొత్త డేట్ గా ఇప్పుడు పుష్ప టు డేట్ ఆగస్టు 15న కలిపి మేకర్స్ కి ఫస్ట్ ఛాన్స్ గా కనిపిస్తుందట. మరి దీనితో ప్రస్తుతానికి అదే డేట్ కి రెండు సినిమాలు లాక్ అయ్యేలా ఉన్నాయని చెప్పాలి. మరి ఈ ఇంట్రెస్టింగ్ అంశం పై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.