జాక్ పాట్ కొట్టేసిన మృణాల్ ఠాగూర్.. వందేళ్లు తపస్సు చేసిన రాని ఛాన్స్ కొట్టేసిందిగా..

ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా క్రేజ్ ను సంపాదించుకుంది మృణాల్‌ ఠాగూర్. ఆమె చేసినది రెండు సినిమాల్లోనే అయినా.. రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుని దూసుకుపోతున్న ఈ చిన్నది.. తెలుగు రాష్ట్రాల్లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. కుర్రాళ్ల లేటెస్ట్ క్రష్ గా దూసుకుపోతుంది. మొదట సీతారామం సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. అచ్చ తెలుగు ఆడపడుచుల కట్టు,బొట్టు, సాంప్రదాయంతో సీతా మహాలక్ష్మి, ప్రిన్స్‌ నూర్జహాన్ గా పాత్రలో జీవించేసింది. అవ్వడానికి ముంబై అమ్మాయే అయినా.. మన తెలుగింటి ఆడపిల్లల కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Prabhas - Hanu Raghavapudi Combo Set with a Whopping Budget? | Prabhas - Hanu  Raghavapudi Combo Set with a Whopping Budget?

ఈ సినిమా తర్వాత నాని హాయ్ నాన్న సినిమాలో హీరోయిన్గా నటించగా ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అవ్వడంతో ఈమెకు వరుస ఆఫర్లు క్యూ క‌డుతున్నాయి. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మకు మరో అద్భుతమైన అవకాసం వరించిందని ఫిలిం వర్గాల నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి. త్వరలో ప్రభాస్ కు జోడిగా ఈ ముద్దుగుమ్మ జాతకట్టనుందట. ప్రభాస్ హీరోగా డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో త్వరలోనే పిరియాడికల్ డ్రామా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో తర్కెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే మొదలైపోయాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా మృణాల్‌ను సెలెక్ట్ చేశారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు. అదే నిజమైతే మృణాల్‌ దిశ తిరిగినట్లే అవుతుంది. ఇక ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్‌లో నటిస్తున్న మృణాల్‌ త్వరలోనే ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్‌తో అవకాశం అందుకుంది అంటూ వార్తలు వైరల్ అవ్వడంతో.. వందేళ్లు తపస్సు చేసిన రాని గ్రేట్ ఛాన్స్ రెండు మూడు సినిమాల హిట్ తోనే సాధించేసావ్ మృణాల్‌ అంటూ నువ్వు చాలా ల‌క్కీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.