1000కోట్ల భారీ బడ్జెట్ తో మైఖేల్ జాక్సన్ బయోపిక్.. హీరో ఎవరంటే..?!

పాప్ సింగర్ మైకెల్ జాక్సన్ బయోపిక్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూ.1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. మైఖేల్ టైటిల్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో మైఖేల్ జాక్సన్ సోదరుడు జర్మన్ జాక్సన్ కొడుకు జాఫర్ జాక్సన్ నటిస్తున్నాడు. జాఫర్ అచ్చం మైఖేల్ జాక్సన్ లానే కనిపించడం.. అలాగే జాఫర్ నడక, డ్యాన్స్ ఇలా అన్నీ మైకెల్‌నే పోలి ఉండడంతో మైకల్ జాక్సన్ పాత్రకు జాఫర్ తప్ప మరెవరైనా ఇంతలా సెట్ అవ్వరని సినిమా డైరెక్టర్ ఆంటోయిన్ ఫుక్వా, నిర్మాత గ్రహం కింగ్.. జాఫర్‌ని సెలెక్ట్ చేసినట్లు వివరించారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన జాఫర్ లుక్ రిలీజై వైర‌ల్‌గా మారింది. ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ చూసిన వారంతా జాఫర్ అచ్చం మైకేల్ లాగే ఉన్నాడని.. మైకేల్ తిరిగి వచ్చినట్లే ఉందంటూ.. తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా మైకల్ జాక్స‌న్ జీవితంలో కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. వాటిలో చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే వివాదం కూడా ఒకటి. అయితే మైఖేల్‌ను ఇన్నోసెంట్ వ్య‌క్తిగా.. ఈ పాప్ సింగర్ చిన్నారులను వేధించలేదనే.. కోణంలో ఈ సినిమాని ఆంటోయిన్ తెరకెక్కించనున్నాడట.

ఇప్పటివరకు హాలీవుడ్‌లో రూపొందిన అన్ని బయోపిక్లలో అత్యంత భారీ బడ్జెట్లో కూడుకున్న బయోపిక్ మైఖేల్‌దే అంటూ ఫిలిం సర్కిల్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. రూ.1000 కోట్లకు పైగా ఈ సినిమాకు బడ్జెట్‌ను కేటాయిస్తున్నారట. వచ్చే ఏడాది ఏప్రిల్ 18న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. భారీ అంచనాల నడుమ రిలీజ్ కానున్న మైఖేల్ సినిమాకు పెట్టిన పెట్టుబడులు రెండింతలుగా అంటే రూ.2000 కోట్లు వసూలు చేస్తుందని మేకర్స్‌తో పాటు.. మైఖేల్ అభిమానులు కూడా అంచనాలు వేస్తున్నారు. ఇక 2009 జూన్ 25న మైఖేల్ మరణించిన సంగతి తెలిసిందే.