వాట్.. ఒక్క ఏడాదిలోనే కృష్ణవంశీ ఆ సినిమాను 1000 సార్లు చూసాడా.. ఎందుకు అంత స్పెషల్ అంటే..?!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకత ముద్ర వేసుకున్నాడు డైరెక్ట‌ర్ కృష్ణవంశీ. ప్రస్తుతం అడపదడపా సినిమాల‌ను మాత్ర‌మే తెర‌కెక్కిస్తూ ముందుకు సాగుతున్న ఈయ‌న‌ ఒకప్పుడు త‌ను తెర‌కెక్కించిన దాదాపు అన్ని సినిమాల‌తో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. త‌ను తెర‌కెక్కించిన సినిమాల‌తో చాలామంది హీరోలని కూడా స్టార్ హీరోలుగా మార్చాడు. ముఖ్యంగా అక్కినేని నాగార్జున లాంటి హీరోతో నిన్నే పెళ్ళాడుతా లాంటి ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ సినిమా చేసి తనలో ఇలాంటి ఒక యాంగిల్ కూడా ఉందని జనానికి చూపించాడు. నిజానికి మన ఇండస్ట్రీలో కృష్ణవంశీ లాంటి డైరెక్టర్ మరొకరు ఉండ‌ర‌న‌టంలో అతిశ‌యోక్తి లేదు.

ఆయన సినిమాలో నటిస్తే చాలు ఏ నటుడైన‌ మళ్లీ పుడుతాడు అంటూ చిరంజీవి లాంటి ఓ స్టార్ హీరో ప్ర‌సంస‌లందించారంటే.. ఇంతకుముందు వాళ్ళు చేసిన సినిమాల కంటే కూడా ఈయన సినిమాలో చేస్తే నటుడిగా వాళ్ళ జర్నీ అనేది కొత్త స్టైల్ లో ఉంటుందంటూ చెప్పుకొచ్చారంటే ఆయ‌న సినిమాలు ఏ రేంజ్‌లో ఉండేవో.. ఆయ‌న డైర‌క్ష‌న్ టాలెంట్ ఏంటో అర్ధం చేసుకోవ‌చ్చు. అయితే చిరంజీవి.. కృష్ణవంశీ డైరెక్షన్ లో ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ రామ్ చరణ్‌తో కృష్ణవంశీ ‘గోవిందుడు అందరివాడేలే’ అనే సినిమా తెర‌కెక్కించాడు. ఆ సినిమా టైంలో చిరంజీవి కూడా చాలావరకు దగ్గరుండి అన్ని చూసుకున్నారు. అయితే వీళ్ళ కాంబోలో కూడా ఒక సినిమా రావాల్సింది కానీ.. అది అనుకోని కారణాల వల్ల మిస్ అయ్యిపోయింది.

కృష్ణవంశీలో ఉన్న డైరెక్షన్ కెపాసిటీ చిరంజీవికి తెలుసు కాబట్టి.. ఆయన రామ్ చరణ్ ని కృష్ణవంశీకి అప్పజెప్పారు. అయ‌న‌తో చ‌ర‌ణ్ ఓ సినిమా చేసేలా చేశాడు. ఇక ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా దాంట్లో రామ్ చరణ్ న‌ట‌న‌కు అంతాఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే ఇంత మంచి డైరెక్టర్ గా క్రేజ్ సంపాధించుకున్న‌ కృష్ణవంశీ ఇండస్ట్రీకి రావడానికి.. ఆయనను ఇన్‌స్పైర్‌ చేసింది మాత్రం సూప‌ర్ స్టార్ కృష్ణగారట. ఆయన చేసిన అల్లూరి సీతారామరాజు సినిమాని ఒకే ఏడాదిలో వెయ్యి సార్లు చూసి కృష్ణ వంశీ ఇన్స్‌పైర్‌ అవ్వడమే కాదు.. ఆయ‌న‌ కూడా సినిమా ఇండస్ట్రీకి వెళ్లి సినిమాలు చేయాలని చాలా స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యాడట. అలా అల్లురి సీతా రామ‌రాజుమూవీ ఎఫెక్ట్‌తో ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చి డైరెక్టర్‌గా మారి సినిమాలను తెర‌కెక్కించి సక్సెస్ అందుకున్నారు. చాలా కాలం స్టార్ డైరెక్ట‌ర్‌గా కొన‌సాగాడు.