తన ఫస్ట్ రెమ్యూనరేషన్తో తల్లిదండ్రులకి అటువంటి గిఫ్ట్ ఇచ్చిన నిహారిక..?

నిహారిక గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లోనే మంచి పేరు సంపాదించుకుంది నిహారిక. మెగా డాటర్ గా రాణిస్తుంది.టీవీ షోస్ తో కెరియర్ ప్రారంభించిన ఈ అమ్మడు ప్రస్తుతం వెబ్ సీరీస్,సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

చిన్నప్పటి నుంచి సినిమా ప్రపంచంలోనే పెరగటంతో ఈ బ్యూటీ చదువు కంప్లిట్ అయ్యాక..సినీ ఇండస్ట్రీ వైపు ఎక్కువగా మక్కువ చూపించింది. తండ్రి నాగబాబు జడ్జ్ గా వ్యవహరించిన ‘ ఢి జూనియర్’ షోకు నిహారిక ఏడాదికి పైనే యాంకర్ గా చేసింది.అయితే తాజాగా మెగా డాటర్ ఓ ఇంటర్వ్యూకు హాజరై..తన మొదటి పారితోషికం ఎంత? ఏం చేసింది? అనే విషయాలు చెప్పుకొచ్చింది. నిహారిక ఢీ జూనియర్ షో కు ఫస్ట్ అందుకున్న రెమ్యూనరేషన్ రూ. 20 వేలు అంట. పెద్దగా డిమాండ్ ఏం చేయలేదట.

అయితే ఫస్ట రెమ్యూనరేషన్ తో నిహారిక.నాగబాబుకు హెడ్ ఫోన్స్ కొనిచ్చిందంట. ఎందుకంటే వారి ఇంట్లో టీవీ ఒక్కటే ఉండేదంట. నాగబాబు ఎప్పుడు టీవీలోనే సాంగ్స్ పెట్టుకుని వినేవాడట. ఎక్కువగా ఆయనకు టీవీ చూస్తేఛాన్స్ ఉండకపోవటంతో మెగా డాటర్ హెడ్ ఫోన్స్ కొన్నాక.. ఫోన్స్ లో సాంగ్స్ వింటూ రిలాక్స్ అయ్యేవాడంట. ఇక నిహారిక అమ్మకు ముక్కు పుడక అంటే ఎంతో ఇష్టమని ఆమెకు గోల్డ్ ముక్కు పుడక చేయించి ఇచ్చిందంట.