‘కార్తీకదీపం’ సీరియల్ : మోనిత పాత్రలో కనిపించబోతున్న కొత్త నటి ఆ స్టార్ హీరో చెల్లా..?

ఓ మగధీర.. ఓ బాహుబలి.. ఓ ఆర్ ఆర్ ఆర్.. ఓ కార్తీక దీపం .. ఎస్ ఇలాంటి కామెంట్స్ తోనే సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నారు కార్తీకదీపం ఫ్యాన్స్. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోకి హీరోయిన్ కి ఎంత క్రేజీ పాపులారిటీ ఉందో అంతకు మించిన స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్నారు డాక్టర్ బాబు – వంటలక్క . వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే . కార్తిక దీపం సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోయారు.

టిఆర్పి రేటింగ్స్ లో దుమ్ము దులిపేసిన కార్తీకదీపం సీరియల్ కి సీజన్ 2 తీసుకొస్తున్న విషయం అందరికీ తెలిసిందే . కార్తీకదీపం నవవసంతం పేరిట ఈ సీరియల్ సీజన్ 2 టెలికాస్ట్ కాబోతుంది. ఇది కూడా స్టార్ మా చానల్లోనే టెలికాస్ట్ కాబోతుంది . మార్చ్ 25 నుంచి ఈ సీరియల్ టెలికాస్ట్ కాబోతుంది . రాత్రి 8 గంటలకు టెలికాస్ట్ కాబోతుంది అంటూ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు . ఇప్పటికే కార్తీకదీపం నుంచి పలు ప్రోమోలు రిలీజై వైరల్ అవుతున్నాయి .

ఈ సీజన్లో మెయిన్ లీడ్స్ క్యారెక్టర్ డాక్టర్ బాబు – వంటలక్క పాత్రలను ఏమాత్రం మార్చుకుండా నిరూపమ్ పరిటాల-ప్రేమ్ విశ్వనాధన్ ను పెట్టుకున్నారు . అయితే నెగిటివ్ షేడ్స్ ఉన్న మోనితా పాత్ర కోసం మాత్రం కొత్త బ్యూటీని తీసుకొచ్చారు . కార్తీకదీపం సీరియల్ సీజన్ 2 లో నెగిటివ్ షేడ్స్ పాత్ర కోసం యాంకర్ గాయత్రి సింహాద్రి నటిస్తుంది. ఆల్రెడీ రిలీజ్ చేసిన ప్రోమోలో గాయత్రి సింహాద్రి కనబడింది .

డాక్టర్ బాబు ఇంట్లోనే ఉండే అమ్మాయి పాత్రలాగే ఉంది . అయితే చాలామంది ఫస్ట్ ఈమెను చూడగానే స్టార్ హీరో చెల్లెలా ఉంది అంటూ అభిప్రాయపడ్డారు . ఆ తర్వాత ఆమె ఓ యాంకర్ ఆమె గాయత్రి సింహాద్రి అని తెలుసుకొని షాక్ అయిపోయారు . గతంలో ముద్దమందారం , త్రినయని లాంటి పలు సీరియల్స్ లో నటించి మంచి పేరు సంపాదించుకుంది . మరి కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎలాంటి పేరు సంపాదించుకుంటుందో చూడాలి..????