నేడు సినిమా ఇండస్ట్రీకి ఎంతో స్పెషల్ డే.. వెయ్యి జన్మలు ఎత్తిన మర్చిపోలేని రోజు..!

మార్చి 25 చాలామందికి ఈ డేట్ సాదాసీదాదే కావచ్చు .. కానీ కొంతమందికి మాత్రం ఈ డేట్ ఎప్పటికీ మర్చిపోలేని ఒక అపురూపమైన రోజు . మరీ ముఖ్యంగా సినీ లవర్స్ కి ఎన్టీఆర్ – రామ్ చరణ్ ఫాన్స్ కి 1000 జన్మలెత్తినా సరే ఇలాంటి తేదీ మళ్లీ మళ్లీ రాని రోజు అంత స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా..? అది తెలియాలి అంటే ఇది చదవండి మీకే అర్థమవుతుంది..!!

దర్శక ధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి ..బాహుబలి సినిమాతో ఎంత పాపులారిటీ దక్కించుకున్నాడో అందరికీ తెలిసిందే . అయితే అంతకు డబల్ రేంజ్ లో క్రేజ్ దక్కించుకున్న సినిమా మాత్రం ఆర్.ఆర్.ఆర్ అనే చెప్పాలి . రణం రౌద్రం రుధిరం అంటూ ఎంతో కష్టపడి ఇష్టంగా తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసింది . కోట్లాదిమంది ఇండియన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ కొన్ని ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆస్కార్ అవార్డును ఇండియాకు తీసుకొచ్చింది .

ఈ సినిమా రిలీజ్ అయ్యి నేటికీ రెండేళ్లు అవుతుంది . ఇప్పటికీ ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ పేరు వినిపిస్తూనే ఉంది ..అంటే దానికి కారణం రాజమౌళి డైరెక్షన్ అని చెప్పక తప్పదు . కొన్ని రోజుల క్రితమే రాజమౌళి జపాన్ లో ఆర్ ఆర్ ఆర్..సినిమాను మళ్ళీ ప్రమోట్ చేసి ఆ సినిమాకు మంచి హైప్ ఇచ్చాడు. 2022 మార్చి 25వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా నేటికీ విడుదలై రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన క్లిప్స్ ను – హాష్ ట్యాగ్స్ ను నెట్టీంట బాగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . టాలీవుడ్ ఇండస్ట్రీలోనే బడా హీరోలుగా పాపులారిటీ సంపాదించుకున్న ఎన్టీఆర్ – రామ్ చరణ్ మల్టీస్టారర్ మూవీ సినిమా రికార్డులు సృష్టించింది . ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్ గా నటించింది..!!