‘ దేవర ‘నుంచి గూస్ బంప్స్ వీడియో క్లిప్ లిక్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్(వీడియో)..!!

టాలీవుడ్ యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో న‌టిస్తున్న‌ సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలని మేకర్స్‌ భావించగా.. పలు కారణాలతో సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక దీంతో ఈ సినిమాను అక్టోబర్ 10న రిలీజ్ చేసేందుకు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక ఇటీవల కాలంలో ఈ సినిమాకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ బయటకు రాలేదు. దీంతో సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తే బాగుండ‌ని ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో గోవా సాగర్ తీరంలో ఎన్టీఆర్ మీద ఓ సన్నివేశం తెరకెక్కిస్తుండగా.. వీడియో లీక్ అయింది. ఇక ప్రస్తుతం దేవర లేటెస్ట్ షెడ్యూల్ గోవాలో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఓ యాక్షన్ ఎపిసోడ్ తో పాటు ఒక సాంగ్ కూడా రూపొందించనున్నారట.

జాన్వి కపూర్ – ఎన్టీఆర్‌లతో డ్యూయెట్‌ను ప్లాన్ చేశారట. ఈ క్రమంలో దీంతో సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తే బాగుందని ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో నల్ల దుస్తుల్లో ఉన్న ఎన్టీఆర్ సముద్రంలో నుండి బయటకు తనదైన స్టైల్ లో నడిచి వస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. గూస్ బంప్స్‌ రేపే విధంగా ఈ విజువల్స్ ఉన్నాయి. కొర‌టాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాకు ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడని టాక్. ఆయన రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నాడట. దేవర సినిమాలో విల‌న్‌గా నటిస్తున్నాడు. ఎన్టీఆర్, జాన్వి కాంబినేషన్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఒకప్పటి బ్లాక్ బస్టర్ కాంబో ఎన్టీఆర్, శ్రీదేవి వారసులుగా.. జూనియర్ ఎన్టీఆర్, జాన్వి జతకట్టడం తో ఈ సినిమాపై మంచి హైప్‌ నెలకొంది. అలాగే ఆర్‌ఆర్ఆర్ లాంటి భారీ బ్లాక్ బ‌స్టర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు వస్తుందో అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవెల్‌లో నిర్మిస్తున్న ఈ సినిమా సముద్ర తీరం నేపథ్యంలో సాగే ఒక కథతో అద్భుతమైన విజువల్స్‌తో తెరకెక్కుతుందట. సినిమా విఎఫ్ఎక్స్‌ కోసం గట్టిగానే ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ పుట్టినరోజు స్పెషల్ గా మూవీ టీజర్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ – అనిరుధ్‌ కాంబోలో ఫస్ట్ సినిమా ఇదే కావడం విశేషం. ఇక ఈ సినిమా రెండు పార్ట్‌లుగా తెరకెక్కుతుందని కొరటాల శివ ప్రకటించిన సంగతి తెలిసిందే.