రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న గామి.. మూడు రోజుల్లో ఎంత రాబట్టిందంటే..?!

టాలీవుడ్ మాస్‌కా దాస్ విస్వ‌క్ సేన్ తాజాగా గామి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో చాందిని చౌదరి హీరోయిన్గా నటించింది. మునుపెన్నడు లేనివిధంగా విశ్వక్ డిఫరెంట్ లుక్ లో, క్యారెక్టర్‌తో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. విద్యాధ‌ర్‌ కాగితపు ఈ సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో శ్ర‌మ‌ప‌డ్డాడు. ఆరేళ్లు పనిచేసి తెరకెక్కించిన ఈ సినిమా విజువల్స్ తో పాటు.. స్టోరీ కూడా చాలా అద్భుతంగా రూపొందించారు. ఇక ఈ సినిమాతో విశ్వక్ భారీ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా రిలీజ్ అయింది.

మొదటి షో తోనే పాజిటివ్ టాక్‌ను అందుకున్న గామి.. కలెక్షన్ల పరంగా ప్రపంచవ్యాప్తంగా అదరగొడుతుంది. టీజర్, ట్రైలర్లతో ఈ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేసిన గామి మొదటి షో నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో.. ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తుంది. సరికొత్త ఎక్స్పరిమెంటల్ సినిమాగా.. హాలీవుడ్ విజువల్స్ తో సినిమాను రూపొందించారు. ఈ రేంజ్ విజువల్స్ సినిమాని ఇంత తక్కువ బడ్జెట్ లో తెరకెక్కించడం అంటే అది సాధారణ విషయం కాదు. ఇక ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. రిలీజై మూడు రోజులు పూర్తవ‌డంతో.. తాజాగా మూడు రోజుల గామి వరల్డ్ వైడ్ కలెక్షన్ రికార్డును అధికారికంగా ప్రకటించారు మేక‌ర్స్‌.

ఇప్పటివరకు ఆ సినిమా మూడు రోజుల్లో రూ.20.3 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టినట్లు ప్రకటించారు. ఇక అమెరికాలో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా దూసుకుపోతుంది. మూవీ ప్రీమియర్ షోస్‌తో పాటు మొదటి రెండు రోజుల్లో $400k వసూలు చేసింది. డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయిన శ్లోక ఎంటర్టైన్మెంట్స్‌కు యూఎస్ఏ, కన్నడ ప్రేక్షకుల నుండి అపూర్వమైన ఆదరణ లభించింది. ఇక ఈ మూవీకి వీకెండ్ టైం వరకు ఇదే క్రేజ్ కొన‌సాగితే $500k ను క్రాస్ చేయడం.. చాలా సులభం. ఇక ముందు ముందు ఈ సినిమా కలెక్షన్ ను మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి విశ్వక్‌ ఈ సినిమాతో హ్యాట్రిక్ సక్సెస్ అందుకున్నాడు.