ఐదేళ్లలోపు పిల్లలు ఈ ఆహారం తీసుకోవడం వల్ల ఎన్ని సమస్యలు తలెత్తుతాయో తెలుసా.. ఖచ్చితంగా తెలుసుకోండి..?!

ఐదేళ్లలో పిల్లలు డెవలపింగ్ స్టేజ్ లో ఉంటారు. ఈ ఏజ్ పిల్లలకు శారీరకంగా, మానసికంగా మార్పులు చాలా త్వరగా కనిపిస్తూ ఉంటాయి. ఈ టైంలో వారికి పౌష్టికాహారం అందిస్తూ ఉండాలి. దాంతో వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. అలానే ముందు ముందు జీవనశైలిలో కూడా ఈ వ‌య‌స్సులో మనం అలవాటు చేసే పౌష్టికాహారప అల‌వాట్లే తోడ్పడతాయి. అలానే మనం పౌష్టిక ఆహారంగా భావించే కొన్ని ఆహారాలు ఐదేళ్లలోపు పిల్లలు తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇంతకీ ఆ ఆహార పదార్థాలు ఏంటి.. వాటిని తీసుకోవడం వల్ల ఎదురయ్యే సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఎడాదిలోపు వయసు ఉన్న పిల్లలకు డబ్బా పాలు, గేద పాలను ఇవ్వడం వల్ల వారికి ఆరుగుదల సమస్యలు ఎదురవుతాయి. దీంతో వాళ్ళు అసౌక‌ర్యంగా భావిస్తూ ఉంటారు. అలాగే కొంతమంది ఏడాది దాటిన పిల్లల్లో కూడా పాలు అంటే అలర్జీ ఉంటుంది. అలాంటి వారికి కూడా పాలను ఇవ్వకూడదు.

వీటివ‌ల్ల ఆ సిల్ల‌ల‌తో పాటు త‌ల్లితండ్రులు కూడా ఇబ్బంది ప‌డాల్సి ఉంటుంది. ఒక సంవత్సరంలోపు పిల్లలు తేనెను అసలు సేవించకూడదు. బ్యాక్టీరియాతో కలుషితమయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ కారణంగా ఏడాదిలోపు పిల్లలకు తేనెను అసలు అలవాటు చేయకూడదు. అలాగే పంచదార, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను చిప్స్, చాక్లెట్లు చిరుతిళ్ళు లాంటి వాటిని పిల్లలకు దూరంగా ఉంచితే మంచిది. ఈ ఆహార పదార్థాలు ఊబకాయం లాంటి పలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.