పచ్చ అరటి పండ్లతే ఇన్ని ప్రయోజనాలా.. అవేంటో తెలిస్తే ఖచ్చితంగా అలవాటు చేసుకుంటారు.. !!

సాధారణంగా పండినా అరటిపండును తినడానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు. కానీ పచ్చి అరటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. పచ్చిగా అరటి బంగాళాదుంపకు ప్రత్యామ్నాయంగా కూర‌గా వాడుతూ ఉంటారు. డయాబెటిస్ పేషెంట్లు బంగాళదుంపలు తినకూడదు.. కాని పచ్చి అరటిని తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇక ప్రపంచం మొత్తంలో అరటి అంద‌రు ఎక్కువగా ఇష్టపడి తీసుకునే ఆహారం. సీజన్‌తో సంబంధం లేకుండా.. తక్కువ ధరకే దొరికే మంచి ఆహారం అరటి. ఆరోగ్యానికి కూడా దీనిలో ఎన్నో మంచి గుణాలు ఉంటాయి. ఇక మూడి అరటి పండ్లను బరువు తగ్గడానికి మంచి ఫుడ్ డైట్.

బరువు తగ్గాలని ప్రయత్నించేవారు ఈ అరటి పండ్లు తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఫైబర్ పుష్కలంగా ఉండి జీర్ణశక్తి మెరుగుపరడానికి సహకరిస్తుంది. డయాబెటిక్ పేషంట్లకు పచ్చి అరటి ఎంతో మేలు చేస్తుంది. ఐరన్, స్టాచ్, ఫాస్పరస్, క్యాల్షియం, జింక్ లాంటి ఎన్నో పోషక విలువలు అరటిపండులో సమృద్ధిగా ఉంటాయి. ఇందులో అతి త‌క్కువ గ్లైజమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల ఆహారం త్వరగా జర్ణ‌మౌతుంది. పచ్చ అర‌టి పండ్లు డయాబెటిక్ రోగులకు దివ్య ఔషధం. పండిన అరటికంటే పచ్చి అరటి పండ్లలో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.

అదే టైంలో పండిన అరటి పండ్లు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవచ్చు.. కానీ పచ్చి అరటిపండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది చక్కెర స్థాయిలు కంట్రోల్ చేయ‌ట‌మే కాకుండా కొలెస్ట్రాల్ నియంత్రించి.. గుండె ఆరోగ్య సమస్యలను చెక్ పెడుతుంది. ఇక పచ్చి అరటిపండు ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆకలి పెద్దగా తెలియదు. అలాగే పచ్చి అరటి చర్మానికి కూడా మంచిది. ఇందులో అనేక రకాల విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా చర్మం ముడతలను తొలగించడానికి పచ్చి అరటి పండుని యూజ్‌ చేస్తారు.