ఆమె కోసమే నేను ఇంకా వంటరిగా మిగిలిపోయా..జేడీ చక్రవర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

ఒకప్పుడు వరుస సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన స్టార్ హీరో జెడి చక్రవర్తి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించి సినిమాలతో మరియు పలు వెబ్ సిరీస్ లతో దూసుకుపోతున్నాడు ఈయన. ఇక ఈ హీరో వ్యక్తిగత విషయానికి వస్తే ఇప్పటివరకు కూడా పెళ్లి బంధానికి నోచుకోకుండా బ్యాచిలర్గా కొనసాగుతున్నాడు.

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈయన తను ఎందుకు పెళ్లి చేసుకోలేదో సీక్రెట్ ను రివిల్ చేశాడు. ఈయన మాట్లాడుతూ..” ఎంతో అందంగా ఉంటే కానీ హీరోయిన్స్ అవ్వరు. అందం అనేది చూసే కలలో ఉంటుంది. అలా ప్రతి హీరోయిన్ నచ్చేసింది. అయితే నచ్చడం వేరు ప్రేమించడం వేరు. నాకు శ్రీదేవి అంటే చాలా ఇష్టం. అయితే గులాబీ మూవీ సమయంలో నా హృదయంలో గంటలు మోగాయి. నేను, కృష్ణ వంశీ ఇద్దరం ఒకే హీరోయిన్ ని ప్రేమించాం. ఇప్పటికీ కొట్టుకొని చస్తున్నాం. నాకు నచ్చే డైరెక్టర్లలో కృష్ణవంశీ ఒకరు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.

ఇక ఈ లవ్ నాకు వర్కౌట్ కావని తెలిసి నాకోసం మా అమ్మ వెతికి మరి ఓ అమ్మాయిని తీసుకువచ్చింది. అప్పుడు మాది ఓ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ అవుతుంది. అక్కడే ఆ అమ్మాయిని మీట్ అయ్యాను. ఇక నాతో మాట్లాడుతూ వెళ్ళాక మీ మదర్ ఎక్కడ ఉంటుంది అని అడిగింది. అప్పుడు నేను షాక్ అయ్యాను. ఆవిడకి నేను ఒక్కడినే కొడుకుని మళ్ళీ అలా అడుగుతున్నావ్ ఏంటి అని అడిగాను. ఆమె ఉద్దేశం ఏంటంటే పెళ్లయ్యాక మా అమ్మ మాతో ఉండకూడదని. కానీ నాకు అది అస్సలు ఇష్టం ఉండదు. కనుక ఆవిడ వల్లే నేను ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు ” అంటూ చెప్పుకొచ్చాడు జెడి చక్రవర్తి. ప్రస్తుతం ఈ న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.