2022లో చిన్న సినిమాగా విడుదలై భారీ సంచలనం సృష్టించిన మూవీ డీజే టిల్లు. ఇక ఈ సినిమాలో సిద్దు యాక్టింగ్ వేరే లెవల్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూసి ఈ మూవీకి సీక్వెళ్ళి రూపొందించారు డైరెక్టర్. దానికి టిల్లు స్క్వేర్ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. ఇక తాజాగా ఈ మూవీ నిన్న అనగా మార్చి 29 విడుదలైంది. మొట్టమొదటి షోకే పాజిటివ్ టాక్ మీ దక్కించుకుంది.
ఇక ఈ సీక్వెల్ జోరు చూస్తుంటే మొదటి పార్ట్ ని తలదన్నే విధంగానే కనిపిస్తుంది. అనుపమ హీరోయిన్ గా సిద్దు హీరోగా నటించారు ఈ మూవీలో. ఇక టిల్లు స్క్వేర్ విడుదల కు ముందు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్దు డీజెట్టిల్లు మరియు టిల్లు స్క్వేర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సిద్దు మాట్లాడుతూ.. ” డీజే టిల్లు మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మొదట్లో అసలు హీరో పాత్ర ఎలా ఉంటుందో ప్రేక్షకులకు తెలియదు.
దాంతో మూవీ చూసి సర్ప్రైజ్ అయ్యారు. కానీ ఇప్పుడు మూవీ లో నా క్యారెక్టర్ గురించి మీ అందరికీ తెలుసు. అందువల్లే మ్యాజిక్ చేయడానికి కాస్త ఎక్కువ కష్టపడ్డ. ఈ మూవీలో మంచి సప్రైజెస్ మరియు షాక్స్ ఉంటాయి. అంతేకాకుండా మీరు బాగా నవ్వుకుంటారు కూడా. ఇక ఈ సినిమాకి పార్ట్ 3 ఉంటుందేమో చెప్పలేము. లేదా కొత్తగా ఆలోచించి మా ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా. రెండు మూడు కొత్త ఆలోచనలు అయితే ఉన్నాయి ” అంటూ వెల్లడించాడు సిద్దు. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.