అమ్మ బాబోయ్.. ఒక్క యాడ్‌కి రణ్‌వీర్ సింగ్..ఎన్ని కోట్లు ఛార్జ్ చేస్తాడో తెలుసా..? తెలుగు హీరోలు పది మంది బ్రతికేస్తారు..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కేవలం సినిమాల ద్వారానే కాదు .. పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తూ కూడా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. చాలామంది హీరోలు ఇదేవిధంగా కోట్లు సంపాదించేశారు . మన తెలుగులో కూడా చాలామంది హీరోలు ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తూ అడ్వటైజ్మెంట్లో నటిస్తూ ఉంటారు . బాలీవుడ్ హీరోలు కూడా అంతే .

అయితే ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో రన్వీర్ సింగ్ కి సంబంధించిన ఒక విషయం నెట్టింట బాగా వైరల్ అవుతుంది. రన్వీర్ సింగ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరో ..ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. సినిమాల్లో ఒక్కొక్క సినిమాకి హ్యూజ్ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకుంటారు . అయితే పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసే రన్వీర్ సింగ్ 360 కోట్లకు పైగానే నికర ఆస్తులు కలిగి ఉన్నాయి అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . అంతేకాదు రన్వీర్ సింగ్ ఒక్క ఆడ్ ని ప్రమోట్ చేస్తేనే దాదాపు నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటారట.

ఇది చాలా చాలా ఎక్కువ .. మన తెలుగు యాక్టర్స్ ఇంత హై రేంజ్ లో డిమాండ్ చేయరు . అంతేకాదు అగ్రిమెంట్ రాయించుకుంటే మాత్రం ఏకంగా 10 నుంచి 15 కోట్లు ఛార్జ్ చేస్తాడట . 2022వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ రన్వీర్ ను బ్రాండ్ ఎండార్సర్ ఆఫ్ ది ఇయర్’ గా ప్రకటించింది. అంతేకాదు రన్వీర్ సింగ్ భార్య దీపిక పదుకొనే సైతం పలు సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తుంది . రన్వీర్ సింగ్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు వైరల్ కావడంతో తెలుగు జనాలు షాక్ అయిపోతున్నారు. ఆ డబ్బులు ఏవో మా తెలుగు హీరోలకి ఇవ్వండి పదిమంది కలిసి మీకు ఒక యాడ్ చేసి పెడతారు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!