విశ్వక్ సేన్ తలరాతనే మార్చేసిన తారక్ సలహా ఏంటో తెలుసా..? దొందూ దొందే అంటే ఇదే..!!

విశ్వక్ సేన్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చి శభాష్ అనిపించుకుంటున్నాడు. హోస్ట్ అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఇస్తూ..”బాలయ్య తో మందేసే మాట వాస్తవమే.. కానీ అది వీక్లీ కాదు ఎప్పుడైనా కలిసినప్పుడు.. ఏదైనా సక్సెస్ మీట్ లో కలిసినప్పుడు లేదా ..పార్టీ చేసుకున్నప్పుడు అంతే అంటూ ఆన్సర్ ఇచ్చాడు”.

అంతేకాదు ఎన్టీఆర్ ని ఓ రేంజ్ లో పొగిడేశారు . “జూనియర్ ఎన్టీఆర్ చాలా మంచివాడు అని.. నేను పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన సలహా నా జీవితాన్నే మార్చేసింది అని.. చాలా ఎమోషనల్ గా స్పందించారు”. ” దమ్కీ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చాడు . అయితే అంతకు ముందు రోజు వరకు కూడా ఆయన అమెరికాలో ఉన్నాడు . ఆస్కార్ అవార్డులు వేడుకలు బిజీగా ఉన్నాడు . ఆ తర్వాత రెండు రోజులు కూడా ఫుల్ బిజీ షెడ్యూల్ ..కానీ అక్కడ ఆ మీటింగ్స్ ను ఈవెంట్స్ ను వదులుకొని నా సినిమా ప్రమోషన్స్ కోసం ఇండియాకి తిరిగి వచ్చాడు “..

“ఆ విషయం నాకు ఆలస్యంగా తెలిసింది . ఎన్టీఆర్ మంచితనం అప్పుడే నాకు అర్థమైంది. అంతేకాదు నా పర్సనల్ లైఫ్ పరంగా ఆయన ఇచ్చిన సలహా నా కెరియర్ ని మార్చేసింది. ఫుల్ కన్ఫ్యూషన్ లో ఉన్నాను ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ..ఆ సమయంలో ఎన్టీఆర్ అన్న ఇచ్చిన సలహా నాకు బాగా ఉపయోగపడింది.. ఎప్పటికీ మర్చిపోలేను అంటూ ఎమోషనల్ గా స్పందించాడు”. ప్రజెంట్ ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . అయితే చాలామంది విశ్వక్ సేన్ ను జూనియర్ ఎన్టీఆర్ కి తమ్ముడుగా అభివర్ణిస్తూ ఉంటారు . ఎందుకంటే ఎన్టీఆర్ కూడా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు ..విశ్వక్సేను కూడా అంతే ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతారు . అందుకే ఇద్దరికీ బాగా కుదిరింది అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!