ఆ స్టార్ హీరో కోసం స్క్రిప్ట్ రెడీ చేసుకున్న త్రివిక్రమ్.. ఈసారైనా హిట్ కొడతావా అంటూ కామెంట్స్..!

స్టార్ డైరెక్టర్ లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈన ఇటీవలే గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకున్నాడు. ఇక ఎప్పుడు తన అద్భుతమైన రచనతో ప్రేక్షకులని ఆరాధించే త్రివిక్రమ్ ఇలా చేయడంతో ఫ్యాన్స్ అందరూ చాలా డిసప్పాయింట్ అయ్యారు.

ఇక త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాపై చాలామంది ఎదురుచూస్తున్నారు. ఇక త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీలో హీరోగా పవన్ కళ్యాణ్ నటిస్తున్నట్లు తాజా సమాచారం. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కోసం త్రివిక్రమ్ ఓ స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక దీనిపై ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ రాలేదు. ఇక గతంలో త్రివిక్రమ్ మరియు పవన్ కాంబినేషన్లో జల్సా, అత్తారింటికి దారేది వంటి సినిమాలు రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇక వీరి కాంబో మరోసారి రిపీట్ అయితే మాత్రం ఈసారి బాక్స్ ఆఫీస్ లో బద్దలు అవ్వాల్సిందే అంటున్నారు పవన్ ఫ్యాన్స్. ఇక ఈ వార్తలు ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది.